ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత రైతుల రైతుల భూములను భూ సేకరణ చట్టం కింద సేకరించేందుకు తాను వ్యతిరేకినని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మరోమారు వెల్లడించిన నేపత్యంలో టీడీపీ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్న మంత్రి నారాయణ పవన్ కల్యాన్ వ్యాఖ్యలను సమ్మతిస్తునే.. మెలిక పెట్టారు. విద్యావేత్తగా అపార అనుభవం సంపాదించిన ఆయన రాజకీయాలలో అడుగుపెట్టి పెట్టగానే వరించిన మంత్రి పదవితో.. ఏకంగా అపార అనుభవం వున్న రాజకీయ వేత్తగా మారిపోయారు.
అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకరించని రైతులపై భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ మరో మారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరారు. రాజధానికి భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నస్పటికీ.. వారిపై భూ సేకరణ చట్టం అమలుపర్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధానికి మిగిలిన భూములను సేకరించేందుకు యజమానుల సమస్యల్ని పరిష్కరించి.. సామరస్య వాతావరణంలోనే తీసుకోవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ ఏ రైతును ఇబ్బంది పెట్టకుండా తాము భూసేకరణ చేస్తున్నామని చెబుతూనే మెలిక పెట్టారు.
ఈ నెల 20వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు మందుకు రావాలని, అలా వచ్చిన వారి భూములపై భూసేకరణ చట్టం అమలుపర్చబోమని సూచించారు. ఇప్పటి వరకు రైతులు అంగీకారంతో ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని చెప్పిన ఆయన, ఈ నెల 20లోగా రైతులు ముందుకు రావాలని అలా రాని వారి భూములపై భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తాము ఏ రైతులను ఇబ్బంది పెట్టమని చెబుతూనే మెలిక పెట్టడం టీడీపీ రాజకీయ నేతలకు అలవాటే. పవన్ కల్యాన్ చెప్పిన దానికి బిన్నంగా వ్యవహరిస్తామని చెప్పకనే మంత్రి నారాయణ చెప్పేశారు. ఇక అమరావతి నిర్మాణం కోసం ఇప్పటి వరకు 34వేల ఎకరాలను సేకరించామని చెప్పారు. మరో 2,200 ఎకరాలు అవసమని తెలిపారు. రాజధాని ప్రకటన తర్వాత భూమి ధర భారీగా పెరిగిందన్నారు. ఇరవై రెట్లకు పైగా పెరిగిందని చెప్పారు. గతంలో భూమి ధర రూ.పది లక్షలకు వరకు ఉండేదని, ఇప్పుడు కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతుందని చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more