కేంద్రంలో ఫుల్ మెజార్టీ సాధించిన బీజేపీ... తెలంగాణలో అంచనాలను కూడా అందుకోలేకపోయింది. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటూ టీ బీజేపీ నేతలు తొడలుగొట్టారే తప్ప సార్వత్రిక ఎన్నికల్లో అంత సీన్లేదని తేలిపోయింది. టీడీపీ-బీజేపీ పొత్తు తెలంగాణలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా గ్రేటర్లో గౌరవప్రదమైన స్థానాలే దక్కాయి. బీజేపీ ఐదు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక ఎంపీని గెలిపించుకుంది. కానీ మిగతా తెలంగాణ జిల్లాల్లో జెండా ఎగరేయలేకపోయింది.
సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసినా మిగతా పార్టీలు మద్దతివ్వడమో, సంఘీభావం తెలపడమో చూస్తుంటాం. కానీ బీజేపీ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుంది. ఏ పార్టీతోనూ కలవటంలేదు. ఎవరినీ కలుపుకుని పోవడంలేదు. మాది ఒంటరి పోరాటం అన్నట్లే ఏకాకిలా ఉండిపోతోంది. కనీసం మిత్రపక్షమైన టీడీపీతోనూ కలవట్లేదన్న చర్చ జరుగుతోంది.ఇలా ప్రతిపక్ష పార్టీలతో బీజేపీ కలవకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాల్లో వామపక్ష పార్టీల హవా ఎక్కువ కనిపిస్తోందని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. సైద్ధాంతిక విభేదాలున్న వామపక్షాలతో ఎలా కలిసి పనిచేస్తామనేది కాషాయ నేతల వాదన.
బీజేపీ ఎవరితో కలవకపోవడానికి మరో కారణం కూడా ఉందట... ఎవరో నిర్వహించే ధర్నాలో పాల్గొంటే... ఆ కార్యక్రమం సక్సెస్ అయితే క్రెడిట్ వారికి వెళ్తుంది తప్ప తమకు రాదనే ఆలోచనతో ఉన్నారట బీజేపీ నేతలు. మాకు పార్టీ ఉంది... కేడర్ ఉంది... మా సిద్ధాంతాలు మాకున్నాయి... ఆ మాత్రం ధర్నాలు, పోరాటాలు మేం చేసుకోలేమా అని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఒకవేళ తాము చేసే ధర్నాకు వేరే పార్టీ నేతల్ని పిలిచినా... ఆ క్రెడిట్ వాళ్లకు పోతుందేమో అన్న భయం కూడా ఉందట బీజేపీ నేతల్లో. ఏదైనా చేస్తే మేమే చేస్తాం... మమ్మల్ని ఎవరూ శాసించాల్సిన, ఆదేశించాల్సిన అవసరం లేదని టీ-బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more