Diffrence between Jagan and Pawan | janasena | AP

What is the differences between jagan and pawan

Jagan, Pawan Kalyan, Pawan Kalyan News, janasena party, Jagan Arrest, Jagan Case, pawan Kalyan On Amaravati, Chandrababu naidu on pawan Kalyan, Pawan Kalyan in capital

What is the Differences between jagan and pawan. Jagan Mohan reddy has political strategy in his every step. But pawan Kalyan moves for people not for his agenda.

జగన్ కు, పవన్ కు తేడా ఏంటో తెలుసా..?

Posted: 08/27/2015 01:32 PM IST
What is the differences between jagan and pawan

జగన్.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న నేత. తండ్రి అండదండలతో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని.. మతం పేరుతో కూడా విదేశాల నుండి అందిన కాడికి దండుకుంటున్నారని రకరకాల ఆరోపణలున్న నేత. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలు జీవితాన్ని కూడా అనుభవించి.. ఇక ముందు కూడా మరోసారి జైలుకు వెళ్లే అవకాశం ఉన్న నేత. ఎప్పుడు చూసినా పరామర్శ యాత్రల పేరుతో జనాల మధ్య కు వెళ్లాఅని , వారి మద్దతు కూడబట్టాలని ఉబలాటపడే తత్వం జగన్ సొంతం. తండ్రి ఇమేజ్ ను వాడుకుంటూ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్న నయా రాజకీయ నాయకుడు. పరామర్శ యాత్రల పేరుతో కార్యకర్తలను మత్తులో ముంచేందుకు అన్ని రకాలుగా మద్దతు పలుకుతారని అపవాదు ఉన్న వ్యక్తి. అన్నింటికి మించి ఏ విషయం మీదైనా ఎదుటి వారిని తిట్టిపోసి తాను వస్తే ఇలాంటి ఉండదు అంటూ డబ్బా కొట్టుకునే ఉత్సాహం. పార్టీలో ఎవరినీ నమ్మకుండా గుడ్డి తాను నమ్మిన దానిని వేదంగా భావించే వ్యక్తిత్వం జగన్ సొంతం.

Also Read:  అక్కడ పవన్ స్విచ్ వేస్తే.. ఢిల్లీలో బల్బ్ వెలిగింది

పవన్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఓ సినిమా యాక్టర్. రాజకీయాల గురించి పూర్తి అవగాహనతో.. ముందుకు వెళుతున్న నేత. సినిమా ఇండస్ట్రీలో తన అన్నయ్య చిరంజీవి ప్రోత్భలంతో ఎంట్రీ ఇచ్చినా.. తన ఇమేజ్ ను పదిలం చేసుకున్న వ్యక్తి పవన్. అన్నయ్య పార్టీ పెట్టినప్పటి నుండి రాజకీయాల మీద స్పందించి.. తర్వాత నిజమైన రాజకీయాలకు చర్చ తీశారు పవన్. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతు పలికి వాటిని అధికారానికి దగ్గర చేశారు. జనాల కోసం తాను ప్రశ్నించడానికి సిద్దంగా ఉన్నానని... ఎవరికీ తాను బానిసను కాదని.. ఎవరికి అన్యాయం జరిగినా కూడా తాను స్పందిస్తానని వపన్ ప్రకటన ఎంతో మందిలో ఆశలు నింపింది. అందుకే తమకు అన్యాయం జరిగింది అని అనుకున్న రైతులు తమ గోడు వినడానికి రావాలని పవన్ ను పిలిచారు. ఇలా ఎలాంటి మరకలు లేకుండా.. ఎక్కడా ఎవరి మీద ఆధారపడకుండా.. ఎవరికి అన్యాయం జరిగినా తాను స్పందించే తత్వం పవన్ ది.

Also Read:  నేను మిత్రపక్షాన్నే కానీ బానిసను కాదు.. నాది ప్రజాపక్షం: పవన్

ఇద్దరికీ తేడా ఏంటీ... పవన్, జగన్ ఇద్దరి పేర్లు మూడక్షరాలే కానీ ఇద్దరి మనస్తత్వాలకు చాలా తేడా ఉంది. అవినీతి చెట్టు కింద పెరిగిన మొక్క జగన్.. రైతుల కోసం చెట్టు చేమలను లెక్కచేయని తత్వం పవన్ సొంతం. ఎప్పుడు చూసినా అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించేది జగన్.. ప్రతి అంశం మీద ఎంతో ఆచితూచి మాట్లాడటం, వీలైతే సలహాలు ఇవ్వడం పవన్ నైజం. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి అనే నినాదం పవన్ ది.. అధికారం కోసమే ఆర్భాటం అంతా అనేది జగన్ పాలసీ.ఇలా చాలా తేడాలున్నాయి.. రైతుల తరఫున చంద్రబాబునైనా, ఎవరినైనా కడిగిపారేసే మనిషి పవన్.. తన పాత కేసులను ఎక్కడ తవ్వి తీస్తారో అని భయపడుతూ తన ప్రయోజనాలను కాపాడుకునే స్వార్థం జగన్ ది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles