తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన రేవంత్ రెడ్డి, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య పెద్ద అగాదం ఉందని అందరికి తెలుసు. పార్టీలో నేనంటే నేనంటూ ఇద్దరి మధ్య పోటీ నడుస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఎంతో కాలంగా పార్టీకి పట్టుగా నిలుస్తూ. పార్టీని ఆదుకున్న ఎర్రబెల్లికి పార్టీలో సీనియర్ నేతగా మంచిపేరుంది. ఇక రేవంత్ రెడ్డి ఒక్కో మాట తూటాలా పేలుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద మాటల దాడి చెయ్యడంతో రేవంత్ రెడ్డి దిట్ట. అందుకే పార్టీలో రేవంత్ మాటకు ఎంతో విలువ ఉంది. తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా మారడానికి కూడా ఇదే కారణం. అయితే ఇద్దరూ ఇద్దరే.. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన తీరే పార్టీకి తలనొప్పిగా మారింది. ఎంతకీ తెలంగాణ టిడిపిలో మార్పు రాకపోవడంతో చివరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారం తర్వాత రేవంత్ రెడ్డి అరెస్టు, విడుదల జరిగిపోయాయి. రేవంత్ కు పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ కి వచ్చారు. అయితే హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లోని ఓ కార్యక్రమానికి రేవంత్ తో పాటు పార్టీ సినియర్ నాయకులు ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు రావాల్సి ఉంది. కానీ దయాకర్ రావు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టిడిపి శ్రేణులు అందరూ కలిసి వెళ్లాల్సి ఉన్నా అది కూడా జరగలేదు. రేవంత్ రెడ్డి ఒంటరిగా అక్కడికి వెళ్లారు. ఇలా రేవంత్ కు, దయాకర్ రావుకు మధ్య పెరుగుతున్న దూరానికి తాత్కాలికంగా తెర పడినట్లు తెలస్తోంది. రేవంత్ రెడ్డి, దయాకర్ రావుల మధ్య సంది కుదిరిందని.. అందులో భాగంగా పార్టీకి రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారని. .దీనికి దయాకర్ రావు కూడా ఒప్పుకున్నారని సమాచారం. మరి అన్నీ మరిచిపోయి దోస్త్ మేరా దోస్త్ అని పాటపాడతారో. ఎవరి పాట వాళ్లే పాడుకుంటారో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more