రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ- సెక్స్ రాకెట్ కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది పేద మహిళలను వ్యభిచార రోంపిలోకి దింపిన కాలనాగుల మరో భాగోతానికి కూడా తెరతీశారా..? అన్న సందేహాలు ఉత్పన్నమవతున్నాయి. అమెరికాలో ఉద్యోగాల పేరుతో భాధిత కుటుంబాల్లోని యువతులను లొంగదీసుకుని అక్రమంగా రవాణా కూడా పాల్పడ్డారా..? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మంచి శరీర వర్ణం, ముఖ వచ్చస్సు, అందం, ఎత్తు, నాజుకుగా వున్న పలువురు యువతులను అమెరికాకు ఉద్యోగం కోసం పంపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు యువతులకు ఉద్యోగాల పేరుతో అమెరికాకు తరలించారని వార్తలతో కాలాంతకులు ఇందుకు కూడా ఓడిగట్టారా అన్న ప్రశ్నలు రాష్ట్ర ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ అనుమానాలు రేకెత్తేందుకు కారణాలు కూడా లేకపోలేదు. కాల్ మనీ సెక్సు రాకెట్ లో ఒక ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. అతడి ద్వారా అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామని ఆశపెట్టి చాలా మంది యువతులను లొంగదీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఉద్యోగం ఇప్పించకపోగా ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తామని, తమతో సర్దుబాటు చేసుకోవాలని వారి కుటుంబాలపై ఒత్తిడి తెచ్చినట్లు పలువురు బాధితుల ద్వారా తెలిసింది. కాల్‌మనీలో సదరు ఎన్ఆర్ఐ భారీగా పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ముఠా దగ్గర అప్పు తీసుకున్న ఒక మహిళ వడ్డీ కట్టలేకపోవడంతో ఆమెను బలవంతంగా లోబరుచుకొని చాన్నాళ్లపాటు లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా ఆమె కుమార్తెపై కూడా కన్నేశారు. తాము చెప్పినట్లు వింటే అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆ యువతిని వశపరచుకున్నారు.
ముఠా సభ్యులంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడటంతో పాటు వేరే వ్యక్తుల వద్దకు కూడా పంపించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి కీలకపాత్ర పోషించాడు. ఆ యువతిని అతడే తొలుత లోబరుచుకున్నాడని సమాచారం. అమెరికాలో తెలుగు వ్యవహారాలు చూసే ఓ ప్రముఖ సంస్థ మాజీ అధ్యక్షుడి ద్వారా అతని కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. గతంలోనూ చాలామందికి అలాగే ఉద్యోగాల ఎరవేసినట్లు సమాచారం. నమ్మినవారిని లైంగికంగా వేధించి, ఎన్ఆర్ఐ వద్దకు పంపుతారు. అలా పంపిన వారిలో చాలా కొద్ది మందికి ఉద్యోగాలు రాగా మిగిలిన వారిని వ్యభిచారంలోకి దింపారనే అనుమానాలు రేగుతున్నాయి.
అయితే అమెరికాకు ఉద్యోగాల పేరుతో అక్రమంగా రవాణాా చేసిన యువతలు అక్కడ ఎలా వున్నారు..? ఏ ఉద్యోగాలు చేస్తున్నారన్న విషయాలు మాత్రం వెలుగులోకి రాలేదు. వారికి అన్ని తెలిసిన రాష్ట్రంలోనే కాలమనీ కాలనాగుల చేతిలో అనేక ఇబ్బందులను ఎదుర్కోని బలవంతంగా వ్యభిచారం రోంపిలోకి బలవంతంగా అడుగుపెట్టిన బాధిత యువతులు.. అగ్రరాజ్యంలో ఏం చేస్తున్నారన్న ప్రశ్న సర్వతా వినబడుతున్నాయి. భాదిత యువతులను ఉద్యోగాల పేరుతో తీసుకెళ్లిన సంస్థలు నిజంగా ఉద్యోగాలిచ్చాయా..? లేక అమెరికాకు తీసుకెళ్లిన సంస్థలు అక్కడ కూడా వారిని పరాయి దేశస్థులకు తాకట్టు పెట్టి తారుస్తున్నాయా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి
అమాయక యువతులను దేశం కాని దేశంలో, బాష తెలియని దేశంలో ఎన్ని అవస్థలు పడుతున్నారో వారికే తెలియాలి. అచ్చ తెలుగు పదహారు అనాల ఆంధ్ర అమ్మాయిలను కాల్ గాళ్స్ గా మారుస్తున్నారా.. ? అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. తెలుగింటి అడపడుచులను బలవంతంగా వ్యభిచారం ఊభిలోకి దింపిన కాల్ మనీ కాలాంతకులు అవకాశంతో పాటు మంచి ఆపర్ వస్తే కన్న తల్లిని, తొడబుట్టిన చెల్లిని కూడా తారుస్తారా..? అని కూడా ప్రజలు నిలదీస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more