తెలుగుదేశం పార్టీలో కలకలం రేగుతోంది. ఉన్న ఎమ్మెల్యేలే తక్కువ అనుకుంటే ఉన్న వాళ్లు కూడా పార్టీని వీడుతున్నారు. అయితే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు టీడిపి నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారని.. అలా ఆఫర్లకు లొంగనిపక్షంలో కేసుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తీవ్ర తలనొప్పిని తెచ్చిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరోసారి ఈ ఓటుకు నోటుకు తెర మీదకు తీసుకువచ్చింది. కేసు విచారణకు హాజరుకావాలని జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ కొనుగోలు చేస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసింది. ఈ కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు కొనుగోలు విషయంలో సీఎం చంద్రబాబు, జూబిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని శంకుస్థాపనకు రావడంతో ఆకేసు మరుగున పడినట్లే అనుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో, మరో ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి అందజేసిన నగదును గోపీనాథే సమకూర్చారని, ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more