హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు కారణాలు ఏమిటన్న విషయాలాను సంగ్రహించి నివేదిక సమర్పించాల్సిన నిజనిర్థారణ కమిటీ నిజాలనే వెలువరించిందా..? లేక కేంద్రం ఒత్తిడికి తలొగ్గి నివేదికను సమర్పించిందా అన్న అనుమానాలు సర్వత్రా వినబడుతున్నాయి. రోహిత్ తో పాటు ఆయన సహచర విద్యార్థుల సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తాజాగా నివేదిక సమర్పించడమే ఈ అనుమానాలకు తావిస్తుందని అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో వివాదాలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని తేల్చిన కమిటీ.. రోహిత్ సహా సహచర విద్యార్థులు సస్సెన్షన్ కు వర్సిటీ అధికారులే కారణమని తేల్చింది. అయితే అప్పటి వరకు కొనసాగిన వైస్ ఛాన్సిలర్ ఉన్నఫలంగా స్థానచలనం కావడం.. ఆ స్థానంలో వీసీ అప్పారావు ఎలా వచ్చారన్న విషయాన్ని మాత్రం నివేదికలో పోందుపర్చలేదు. అసలు యాకూబ్ మెమెన్ ఉరితీత నేపథ్యం నుంచి జరిగిన ఘటనలు వాటి నేపథ్యంలో విద్యార్థులపై తీసుకన్న చర్యలు గురించి కూడా నివేదకలో వివరించలేదు,
రోహిత్ సహా సహచరుల సస్సెన్షన్, తదనంతర పరిణమాల నేపథ్యంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం, ఆ తరువాత కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఎన్ని లేఖలు వచ్కాయి. ఎప్పుడెప్పుడు వచ్చాయి. వీటిపై చర్యలు ఏమీ తీసుకున్నారు. నిజ నిర్థారణ కమిటీ మాత్రం వీసీ, రిజిస్ట్రార్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రకాష్‌బాబు, తదితరులతో మాట్లాడిన మీదట... మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని నివేదికలో వెల్లడించింది. అంటే కేంద్రమంత్రుల లేఖలకు, సంబంధిత శాఖ నుంచి వచ్చిన లేఖలను వీసి పక్కనబెట్టారా..? అన్న అనుమానాలు కూడా వినబడుతున్నాయి.
షకీలా శంషు, సూరత్‌సింగ్‌లతో ద్విసభ్య నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదికలో నిజాలు అవిరయ్యాయని విమర్శలు వినబడుతున్నాయి. మొత్తం వ్యవహారానికి వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్న కమిటీ.. కేంద్రమంత్రులను వారి లేఖలను, సంబందిత శాఖ లేఖల వల్ల రోహిత్ కు అతని సహచరులకు నష్టం జరగలేదని తేల్చడానికే ప్రాధాన్యతినిచ్చిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అంతకుముందు జరిగిన పరిణామాలను కూడా వివరించి కేంద్ర మంత్రులను తప్పించే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more