Jyothula Nehru and 2 other YSRC MLAs may join Telugu desam party

Jyothula nehru to quit ysrcp

YSR Congress mla jyothula nehru, Ycp Deputy Floor leader Jyothula Nehru, TDP, Telugu Desam party, YSRCP, defections, post Budget session, Rajya Sabha elections, YS Jagan Mohan Reddy, PAC Chairman post, Parupula Subbarao, Vanthala Rajeshwari

YSR Congress is all set to lose another member as reports are doing the rounds that the party Deputy Floor leader, Jyothula Nehru might be crossing into TDP.

జంప్ జిలానీల్లో జ్యోతుల, సుబ్బారావు..?

Posted: 03/27/2016 01:24 PM IST
Jyothula nehru to quit ysrcp

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ రెండో దశ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాలు పూర్తికాగానే.. సరిగ్గా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు రాజకీయవర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఢిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్న జ్యోతుల నెహ్రూ పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ పిరాయిస్తున్నారని సమాచారం.

ఈ ఊహాగానాల నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో జ్యోతులతో మంతనాలు జరిపేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రంగంలోకి దింపింది. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఉన్న జ్యోతుల నెహ్రూతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు త్వరలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నెహ్రూతో మాట్లాడేందుకు జగన్ చెవిరెడ్డిని పంపగా..ఆయన మంతనాలు నిర్వహించారు. జగన్ తో ఫోన్లో మాట్లాడటానికి నెహ్రూ నిరాకరించినట్లు తెలుస్తోంది. రాయబారులతో మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపించడంలేదట.

అయితే పార్టీ ఢిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదా కన్నా ఆయనకు మరో పదవి కావాలని కోరికగా వుందని, దాన్ని కోరుకుంటూ తాను జగన్ వద్దకు వెళ్లగా ఆయన ఆ పదవిని ఇవ్వడానికి నిరాకరించడంతో జ్యోతుల నెహ్రూ వైఎస్ జగన్ పై అలకబూనారని, ఇదే సమయం కోసం వేచి చూస్తున్న అధికార పక్షం వెంటనే జ్యోతులను కాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిందని తెలుస్తుంది. అయితే ఆ పదవేంటనేగా మీ డౌట్..? పీఏసీ చైర్మన్ పోస్టు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ ఫోస్టు కోసం తాను పోటీ పడుతుండుగా, దానిని కొత్తవారికి ఇచ్చేందుకు జగన్ సుముఖత చూపుతున్నట్లు తెలిసి జ్యోతుల జగన్ కు దూరం కావాలని అనుకున్నారట.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothula Nehru  YS Jagan  Chevireddy  YSR Congress  TDP  

Other Articles