cbi to investigate on Rs 900 cr loan by IDBI bank, after letting him go

How did cbi let vijay mallya leave india after filing a suo moto case

PM Modi, Arun jaitley, Ms Bhansali, Railway Police, Vijay Mallya case, Mahalaxmi station, Shiv Sena targets Centre over Vijay Mallya, shiv sena samna targets vijay mallya, shiv sena critisizes vijay mallya, vijay mallya economic terrorist, uddav thackarey, Shiv Sena , Samna, Vijay Mallya, Economic terrorist, Centre, PM Modi, Arun jaitley, Dawood Ibrahim

Warning that no bank defaulter will be spared, PM Modi accused Congress of helping the rich usurp people’s money and claimed his government has “tightened the screws” on the “looters” who were now fleeing due to fear of going to jail.

మాల్యాకు మోకరిల్లి.. ఆనక రంధ్రాన్వేషణా..?

Posted: 03/30/2016 03:24 PM IST
How did cbi let vijay mallya leave india after filing a suo moto case

మనం ఏదైనా చిట్ ఫండ్ కంపెనీలో ఎవరికైనా షూరిటీ పెడితే.. వాడు కనిపించకుండా వెళ్తేనో, లేక కట్టలేని స్థితిలో వుంటేనే, లేక తాను చెల్లించాల్సిన పైకం మిగిలిండగానే మరణించిన పక్షంలోనో అతనికి షూరిటీ పెట్టిన వారికి ముందుగా ఫలానా వాడు రుణాలు చెల్లించడం లేదని సమాచారం అందించి ఆ తరువాత.. మీరు చెల్లించాల్సి వస్తుందని చెబుతారు. వారు స్పందించని పక్షంలో నోటీసులు పంపించి వారిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. అలా తామిచ్చిన రుణాలను, లేక ముందస్తు పాటపాడుకుని ఎత్తుకున్న చీటీల తాలుకు డబ్బులను వసూలు చేస్తుంటారు.

అయితే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంలోని పెద్దలతో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఏకంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా దేశానికి చెందిన ఓ ఆర్థిక నేరస్థుడు దేశప్రజల సోమ్ముతో యధేశ్చగా దేశ సరిహద్దులు దాటిపోయిన తరువాత సిబిఐ రంద్రాన్వేషణ చేయడంపై దేశప్రజలలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మాటలే అందుకు ఊతమిస్తున్నాయి. కేంద్రంలో వున్న ఎన్డీఏ ప్రభుత్వం మాల్యా అంశాన్నికి కూడా కాంగ్రెస్ హాయంలోని యూపీఏ ప్రభుత్వానికే అంటగట్టి.. రాజకీయ లబ్ది పోందాలని యోచిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్ మాల్య అంశాన్ని కాంగ్రెస్ కే పరిమితం చేసి రాజకీయంగా అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తుందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అందకనే రంద్రాన్వేషణకు పూనుకుంటున్నట్లు వుంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోడీ మాటలే ఊతమిస్తున్నాయి. బ్యాంకులను మోసం చేసి భారీ రుణాలు ఎగ్గొట్టాలనుకునేవారి ఆటలు ఇకపై చెల్లవని.. అసోం ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ఎగవేతదారులకు పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.

విజయ్ మాల్యా పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వమే కారణమన్న విమర్శలపై మోదీ మండిపడ్డారు. ధనికుల ఖజానా నింపేలా వ్యవహరించిన కాంగ్రెస్ కూడా దీని ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. ‘ప్రజాధనాన్ని కొందరు ధనవంతులు కొల్లగొట్టారని... బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేస్తున్నారని.. అలాంటి డీఫాల్టర్ల చుట్టూ ఉచ్చుబిగించాం. జైలు పాలవుతామనే భయంతో వారు చెమటలు కక్కుతున్నారు. ప్రజాధనం దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఎగవేతదారులు లూటీ చేసింది ప్రజల సొమ్ము. ఆ ప్రతి ఒక్క పైసాను ప్రజలవద్దకు చేర్చటమే తమ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధనికులు దోచుకునేందుకు వీలుగా బ్యాంకుల తలుపులు తెరిచిందని.. తన ప్రభుత్వం ఎక్కడికక్కడ నిబంధనలు కఠినతరం చేయటంతో.. తప్పుచేసిన వారంతా జైలుకెళ్తామన్న భయంతోనే పారిపోతున్నారని మోదీ తెలిపారు. ఇంతవరకు బాగానే వున్నా.. నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరి రెండేళ్లు కావస్తుంది. మరి ఇప్పుడే ఎగవేతదారులు ఎందుకు పారిపోతున్నారన్నదే ప్రశ్న.

ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ పూర్తిగా ఏకపక్ష మోజారిటీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేతదారులు ఎందుకు పారిపోతున్నారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజాసోమ్మను అప్పనంగా రుణం తీసుకున్న మాల్యాను ఎందుకు వెళ్లనిచ్చారు. అదే మాల్యా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వ హాయంలో ఎందుకు దేశం విడచి వెళ్లలేదు. అంటే పారిపోయేందుకు నిబంధులు ఇప్పుడు కఠినంగా వున్నాయా..? లేక అప్పుడే కఠినంగా వున్నాయా..? అన్నది అర్ధంకాని ప్రశ్న.

మాల్యా విషయంలో ప్రధాని అన్న మాటలతో కాంగ్రెస్ నేతలపై కూడా చర్యలు తప్పవని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో చర్యలకు ఉపక్రమించిన కేంద్రం యూపీఏ హయాంలో మాల్యాకు 900 కోట్ల రూపాయల రుణం ఎలా ఇచ్చారన్న అంశాన్ని టార్గెట్ చేసి.. దీనిపై ప్రభుత్వ పంజరంలోని చిలకగా అభివర్ణించబడిన సిబిఐ చేత విచారణ జరిపించాలని అదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే 900 కోట్ల రూపాయల రుణంతో పాటు దేశసరిహద్దులు దాటి వెళ్లేందుకు ఎవరెవరు సహకరించారన్న అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటే బాగుండేది.

విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లే సమయంలో కేవలం ఒక్కటి రెండు రోజుల ముందు పార్లమెంటు హాలులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన వార్తలు కూడా గుప్పుమన్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలోనే ఆయన యదేశ్చగా పార్లమెంటు ఆవరణలోనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలవడమేంటని, అ తరువాతే ఆయన దేశం విడిచి పారిపోవడం ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సహాయ సహకారాలతోనే మాల్యా దేశం విడిచి వెళ్లారని అరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వ నీతివంతమైనదని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ.. మాల్యాకు సంబంధించిన అన్ని అంశాలపై సీబిఐ విచారణ జరిపిస్తే.. వారు చెప్పకుండానే ప్రభుత్వ నీతి, నిజయితీ కూడా బయటపడుతుంది కదా అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  PM Modi  Arun jaitley  mumbai cbi  centre  arun jaitley  

Other Articles