కారు ప్రయాణంతో సీన్ మారింది | KCR targets nalgonda congress key leaders

Kcr targets nalgonda congress key leaders

KCR, nalgonda, gutha sukender reddy, miryalaguda MLA bhaskar rao, TRS, టీఆర్ఎస్, కేసీఆర్, నల్గొండ, గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, తాజా వార్తలు, తెలంగాణ, తెలుగు న్యూస్

KCR targets nalgonda congress key leaders. gutha sukender reddy, miryalaguda MLA bhaskar rao likely to join in TRS soon.

కారు ప్రయాణంతో సీన్ మారింది

Posted: 06/04/2016 01:53 PM IST
Kcr targets nalgonda congress key leaders

తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ ను తట్టుకుని మరీ నల్లగొండ జిల్లాలో నిలబడింది కురువృద్ధ పార్టీ కాంగ్రెస్. మిగతా చోట్ల పక్కనబెడితే అత్యధిక సీట్లతో ఆ జిల్లాలో తమ పార్టీ జెండా ఎగరవేసింది. అయితే గెలిచిందన్న పేరుకే గానీ, అధికారంలో ఉంది వారు కాదు కదా. కాబట్టి అభివృద్ధికి అది ఆటంకంగా మారింది. ఇప్పుడు ఇదే నేతల ఫిరాయింపులకు ఆయుధంగా మారబోతుంది. జిల్లాలోని బలమైన నేతలను ఆకర్ష్ ద్వారా టీఆర్ఎస్ లో కలిపేందుకు కేసీఆర్ గత కొద్దిరోజులుగా రహాస్య మంతనాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. నిధుల విడుదలతోపాటు, పదవులు కూడా ఆఫర్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీలో చేరతారనే ఊహగానాలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో రెండు కీలక వికెట్లు పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

నల్గొండ ఎంపీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా గులాబీ కండువా కప్పేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, వీరిద్దరూ శుక్రవారం సీఎం కేసీఆర్ ను కలవటమే కాదు బయటికి వచ్చాక కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు. అయితే యాదాద్రి ప్రాజెక్టుతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ విషయమై చర్చించేందుకు వచ్చామని వారు చెబుతున్నప్పటికీ పార్టీ మారే విషయంపై మాత్రం నోరు మెదపలేదు.

ఇంకోవైపు కోమటిరెడ్డి కూడా గత కొద్దిరోజులుగా మీడియాకు దొరక్కపోవటంతో వీరందరి జంపింగ్ ఖాయమనే నమ్మకం బలపడుతోంది. ఏదేమైనా ముందు ఊహగానాలు లేపి, ఆపై వాటిని నిజం చేసేస్తున్నారు. హరీష్ రావు తో వీరంతా ‘కారు ప్రయాణం’ చేయటం ద్వారానే ఈ పని ఇంత సులువుగా మారిందని ఓ కీలకనేత వ్యాఖ్యానించడం విశేషం. పార్టీ మారే వీరంతా ఇంతకు ముందు వారిలాగే అభివృద్ధి సాకుగా చూపటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి టార్గెట్ నల్గొండ ద్వారా కీలకనేతలను లాక్కోవటంతోపాటు, దక్షిణా తెలంగాణలో పార్టీ వీక్ గా ఉందన్న లోటును రెండింటిని భర్తీ చేస్తున్నారు గులాబీ బాస్.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  nalgonda  gutha sukender reddy  miryalaguda MLA bhaskar rao  TRS  

Other Articles