సవాళ్లను అధిగమిస్తూ నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం చేపడుతున్న చంద్రబాబుకు అడుగుకు ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా అమరావతి కోసం సేకరించిన భూముల్లో మంత్రులు, వారి బంధువుల వాటా ఉందన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. దీనికితోడు టీడీపీ ఎంపీలు, ఇతర సన్నిహితులు కొనుగోలు చేసిన భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పేరిట సాగిన వ్యవహారం పెద్ద దుమారమే రేపాయి. ఇక ఇప్పుడు నేరుగా ఇందులోకి ఆయన కుటుంబ సభ్యులనే లాగే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అధికారులు సైతం వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజధాని నిర్మాణాలన్ని స్విస్ ఛాలెంజ్ పద్దతిలోనే నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. తాత్కాలిక రాజధాని కోసమే 200 కోట్లు కేటాయించిన ఆయన శాశ్వత రాజధాని కోసం కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైపోతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నిర్మాణం కోసం కాంట్రాక్టులను కట్టబెట్టే కంపెనీల విషయంలో అనుమానాలు మొదలౌవుతున్నాయి.
టెమాసెక్ హోల్డింగ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలోని సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్, వెర్టెక్స్ వెంచర్స్ కంపెనీలకు రాజధాని నిర్మాణం కాంట్రాక్ట్ అప్పజెప్పారు.
వెర్టెక్స్ వెంచర్స్ లో గతంలో చంద్రబాబు కోడలు బ్రహ్మిణి పనిచేశారు. భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని సీఎస్ సహా అధికార యంత్రాగం అంతా హెచ్చరించారంట. అయితే అందుకు వెనకాడని చంద్రబాబు ఆ కంపెనీలకే కట్టబెట్టాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారమంతా బ్రహ్మిణియే దగ్గరుండి మరీ చూసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు మంచి సంబంధాలున్న కంపెనీలకే ఈ మెగా భాద్యతలను అప్పజెప్పటం వెనుక ఆమె చక్రం తప్పినట్లు భోగట్టా.
మొత్తంగా పక్కా ప్రణాళిక ప్లాన్ వేసి మరీ తనకు కావాల్సిన వారికే రాజధాని నిర్మాణం కట్టబెడుతున్నారనే విమర్శలకు ఈ విషయాలు బలం చేకూరుస్తున్నాయి. ఇక ఇప్పుడు భూములను, ప్రభుత్వ ఆస్తులను ఆయా కంపెనీల చేతిలో పెట్టడమే ఏపీ ప్రభుత్వం చేయాల్సిన తదుపరి పని.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more