ఆంధ్రుల అభిమాన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికీ ఎక్కడా పొంతన లేదు. తెలుగు గడ్డపై తెలుగు వారికి జరుగుతున్న అవమానాలను భరించలేక ఆత్మగౌరవ నినాదంతో అప్పటికే ప్రజల్లోకి దూసుకుపోయి ఉన్న ఆ మహానుభావుడిని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చేసింది అశేష తెలుగు జనవాహిని. మరో వైపు ప్రజల్లో కేవలం నటన ద్వారానే కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా తనకు అబ్బిన పాపులారిటీని పణంగా పెట్టి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలి, కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలుగు వారికి విముక్తి కలిగించిన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్... రాజధాని పేరుతో దౌర్జన్యంగా అన్నదాతల భూములను లాక్కుంటున్న సమయంలో కేవలం తన పర్యటన ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోచ్చి ఆ నిర్ణయాన్నివాయిదా వేయించడంతోపాటు, మీకు నేను ఉన్నానంటూ భరోసా కలిపించాడు పవన్. నిజానికి వీరిద్దరినీ పోల్చుకోవటం కొంచెం ఎక్కువే అయినప్పటికీ సూక్ష్మ పోలికలతో సారూపత్యనే కలిగి ఉన్నారని చెప్పొచ్చు.
నటనలో అప్పటికే ఉన్నత శిఖరాలు అందుకున్న ఆయనకు అసలు రాజకీయ ఉనికి అవసరమా? అయిన రంగులు వేసుకునే వారికి ఓట్లు ఎవరేస్తారు అంటూ తోటి నటులే ఆ టైంలో ఎన్టీఆర్ ను గేలిచేశారు. కానీ, 1983 జనవరి 7న తెలుగు రాజకీయాల్లో గుర్తుండిపోయేలా చరిత్ర సృష్టించిన ఆయన ఎదురులేని మనిషిగా నిలిచారు. ఆపై ప్రజా సంక్షేమ నిర్ణయాలతో రామ రాజ్యాన్ని తలపించిన ఆయన పాలన మరో దఫా ఆయన్ని సీఎంను చేసింది. మరి ఆ స్థాయిలో కాకపోయినా పవన్ కి కాస్తో కూస్తో ప్రజా బలం ఉంది. సినిమాలో దాదాపు రిటైర్మెంట్ వయసుకు వచ్చాక ఎన్టీఆర్ రాజకీయ ఆరంగ్రేటం చేస్తే... నటనలో స్టార్ గా వెలుగువెందుతున్న సమయంలోనే పవన్ ఆ నిర్ణయం తీసుకుని షాక్ కి గురిచేశాడు. అలాంటి సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో సేమ్ అన్నగారిని గుర్తు చేసేలా రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్న పవన్ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా ఆ మహానుభావుడిలా సక్సెస్ అవుతాడా? అన్న ప్రశ్న మెదులుతుండగానే, అప్పటి ఇప్పటి అంశాలను, పరిస్థితులను భేరీజు వేసుకుందాం...
90వ దశం అప్పటిదాకా కాంగ్రెస్ ఒక్కటే రూలింగ్ పార్టీగా ఉంది. వామపక్ష పార్టీలు ఉన్నప్పటికీ వాటి హవా అంతంత మాత్రమే. హస్తం అవినీతి పాలన తప్ప తెలుగు ప్రజలకు మరో దారేం కనిపించలేదు. దీంతో కేవలం సహయక కార్యక్రమాలే ప్రారంభిద్దామన్న ఎన్టీఆర్ ఆలోచన రాజకీయం వైపు పడింది. పేద బడుగు వర్గాల విముక్తి థ్యేయంగా పోరాడాలని నిర్ణయించి 1982 మార్చి 29న సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో పార్టీకి ఆజ్యం పోశారు. రాముడు ఎలా ఉంటాడు? కృష్ణుడు ఎలా ఉంటాడు? అన్న ప్రశ్నలకు ఇదిగో ఇలా అన్నగారిలా ఉంటాడు అనే నమ్మకం ప్రజల్లో బాగా నాటుకుపోవటం, ఆపై తమను కాపాడేందుకు చైతన్య రథయాత్ర లో వచ్చిన ఆపద్భాందవుడిలా కనిపించడంతో ప్రజలు మురిసిపోయారు. వెరసి కాంగ్రెస్ దుష్టపాలనకు చరమాంకం పాడి తమకు విముక్తి కల్పించే దేవుడిలా ప్రజలు ఆయన్ను భావించారు. ఆపై ఏం జరిగిందో విదితమే. మరి ఇప్పుడు జనసేనాధిపతి పరిస్థితి ఏంటీ?
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగానే ఉన్నాయి. కానీ, అప్పట్లో పోలిస్తే కాస్త మెరుగైన పరిస్థితులు ఉండటం పవన్ కి వ్యతిరేకాంశాలే అవుతున్నాయి. కుల ప్రస్తావన తేకుండా ఎన్టీఆర్ అప్పుడు రాజకీయ బండిని సమర్థవంతంగా నడపగలిగారు. కానీప్పుడు కాపు, కమ్మ అంటూ వర్గాలు చీలటం, పైగా ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో టికెట్ల పంపిణీ, నేతల ఎంపిక కాస్త కష్టంతో కూడుకున్నదే. పోనీ వెనుకడిన వర్గాలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇక మరో ప్రధాన సమస్య అప్పుడున్న ఆర్థిక వెనుకబాటు లేకపోవటం. అవినీతి రాజకీయాలతో విసిగి వేసారిన ప్రజల్లో తన నాయకత్వంతో ఆ లోటును భర్తీ చేయగలనన్న నమ్మకం కలిగించగలిగాడు ఎన్టీఆర్. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగానే ఉన్నాయి. ఒక్క రాజధాని అభివృద్ధి అనే అంశం తప్పించి ఏ ఆయుధం లేకుండా పోయింది. ఈ మూడేళ్లలో దాంట్లోనూ కాస్త పురోగతి రావొచ్చు.
అప్పట్లో పుట్టగొడుగుల్లా పార్టీలు లేకపోవటం మరో సమస్య. ఇప్పడున్న పార్టీలు చాలవన్నట్లు పవన్ కళ్యాణ్ `జనసేన`తో పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగబోతుండటం ఓట్ల చీలికకు తప్పించి మరో ఉపయోగం ఉండబోదనేది మరో వాదన. 2019 ఎన్నికల్లో పోటీ ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు అడుగులు వేసి తన అదృష్టం పరిక్షించుకోవటం తప్పించి, ఏం లాభం ఒరగకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 9 ఏళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు మరోసారి తన అధికారాన్ని దూరం చేసుకునే అవకాశాలను పవన్ చేతిలో పెట్టలేడనే భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత టీడీపీపై ఇప్పటీ ప్రజల్లో ఏర్పడం చాలా కష్టంతో కూడుకున్న పనే. వెరసి అధికారంలో ఉన్న టీడీపీని, ప్రతిపక్ష వైకాపాను అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అఖండ విజయంతో అలనాటి ఎన్టీఆర్‌ను గుర్తుచేస్తాడా? అన్నది కాలమే నిర్ణయించాలి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more