జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి వివరించిన లోకేష్ | nara lokesh says TTDP defected MLAs back to TDP soon

Nara lokesh says ttdp defected mlas back to tdp soon

Nara Lokesh about TRS situation, Lokesh about defected MLAs, defected MLAs back to TDP soon, TRS to TDP

Nara Lokesh says TTDP defected MLAs back to TDP soon.

లోకేష్ తో టచ్ లో గులాబీ నేత ఎవరు?

Posted: 07/29/2016 11:12 AM IST
Nara lokesh says ttdp defected mlas back to tdp soon

మారిన రాజకీయ సమీకరణాలు ఊహించని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో వలసలను ప్రేరేపించాయి. ఇరు ప్రాంతాల్లో మళ్లీ అవే పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యం, ఉన్న ఈ మూడేళ్లు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వెరసి నేతలను పార్టీలు మారేలా చేస్తున్నాయి. అయితే ఫిరాయింపులతో ఎక్కువ నష్టపోయింది మాత్రం ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయే. ఏపీలో వైసీపీ వలసల వల్ల సీట్ల సంఖ్య తగ్గినా, దాని ప్రతిపక్ష హోదాకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ప్రతిపక్ష హోదా దక్కించుకునే పరిస్థితులు ఉన్నా కీలక నేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకోవటంతో అసలు పార్టీ ఉనికే లేకుండా పోయింది.

అయితే పార్టీ మారిన నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ క్షణంలోనైనా వారు తిరిగి సొంత గూటికే చేరతారని అంటున్నాడు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉందన్న విషయంతోపాటు టీ మంత్రులకు అసలు స్వేచ్ఛే లేదంటూ చెప్పుకోచ్చాడు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టిన ఓ కీలక నేత ఇటీవల నారా లోకేశ్ కు అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. దీంతో అసలు విషయమేమిటో కనుక్కుందామని లోకేశ్ ఫోనెత్తగానే సదరు నేత తన గోడును వెళ్లబోసుకున్నాడట.

అదేంటో లోకేష్ మాటల్లోనే... ‘‘టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఒకాయన ఇటీవల నాకు పదే పదే ఫోన్ చేశాడు. ఓ సారి మాట్లాడితే పోలా అని ఫోనెత్తి 'అన్నా బాగున్నావా?' అని అడిగిన. ‘ఏం బాగున్నామన్నా, ఇక్కడేం బాగాలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్ నాతో మూడు గంటల పాటు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా ఇచ్చిండు. ఇగో, ఇప్పటివరకు మళ్లీ కలవనియ్యలే’ అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడంట.

మరి ఇంచార్జీ మంత్రితో అయినా మాట్లాడకపోయినవా? అని లోకేష్ ప్రశ్నించగా...‘అన్నా నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. కానీ, నేను మంత్రిని. నాకు నోరు లేదు అంటూ సదరు మంత్రి జవాబిచ్చాడంట’ ఇలా ఆ జంపింగ్ నేత తన బాధ మొత్తాన్ని లోకేష్ దగ్గర ఏకరువు పెట్టాడంట. అంతలా బాధపడ్డ ఆ మాజీ తమ్ముడు ఎవరయి ఉంటారంటారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh TTDP  Defected MLA  TRS  Back  

Other Articles