మైలేజీ కోసమే డీఎంకే రైల్ రోకో..? Is opposition parties rail roko for gaining mileage.?

Is opposition parties rail roko across tamil nadu for gaining mileage

Cauvery issue, Cauvery issue news, Rail Roko, DMK, AIADMK, Tamil Nadu, Karnataka, jayalalithaa health, apollo doctors, Cauvery conflict, Rail Roko demonstration, MK Stalin, Cauvery Water Management Board, Cauvery dispute, Delta farmers organisdations, 48-hour rail roko

Is opposition parties 48-hour rail roko agitation over the Cauvery conflict is for parties mileage, or to divert peoples attention from CM jayalalithaa health.?

మైలేజీ కోసమే డీఎంకే రైల్ రోకో..?

Posted: 10/17/2016 03:35 PM IST
Is opposition parties rail roko across tamil nadu for gaining mileage

తమిళనాడులో ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. సుమారుగా ముఫై ఐదేళ్లుగా కొనసాగుతున్న అనవాయితీని కాదని తమిళనాట ప్రజలను ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో అకర్షించి మరో పర్యాయం కూడా అధికారంలోకి వచ్చారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. అయితే అమె అరోగ్యం క్షీణించిన నేపథ్యంలో చెన్నైలోని అపోలో అస్పత్రిలో చికిత్స పోందుతున్న అమె త్వరగా కోలుకోవాలని ఓ వైపు రాష్ట్రం నలువైపుల నుంచి అమె అభిమానులు.. కార్యకర్తలు, పార్టీ శ్రేణలు, ప్రజలు అపోలో అస్పత్రి వద్దకు వచ్చి అమ్మకోసం అంటూ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.

గత 26 రోజలుగా జయలలిత అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పోందుతున్న తరుణంలో.. అమె కోసం యావత్ రాష్ట్రం అంగలార్చుతున్న సమయంలో ప్రజల దృష్టిని అమె వైపు నుంచి ఒక్కసారిగా మళ్లింది. ఇందుకు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు కారణమైంది. ఎందుకలా.? రైతు సంఘాలు జయలలిత ఎందుకని విస్మరిస్తున్నాయి. అమ్మ అరో్గ్యం రైతు సంఘాలు పట్టాదా..? వారి కోసం ఎంతో చేసిన జయలలితను ఎందుకు విస్మరించేలా చేస్తున్నాయన్న ప్రశ్నలు ఉత్పన్నం కాక తప్పదు.

రాష్ట్ర ప్రజలు తమ ముఖ్యమంత్రి జయలలిత అరోగ్యంగా వుండాలని, అమె మళ్లీ పరిపాలనా పగ్గాలను చేపట్టాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో ఆలయాలకు క్యూ కడుతున్న వేళ.. ఆ వార్తలను మీడియా కవరేజ్ చేయడంతో యావత్ రాష్ట్రం అమ్మా నీకేం కాదు అంటూ అర్థిస్తున్న సమయంలో.. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. అందుకు గత కొన్నాళ్లుగా మౌనంగా వున్న రైతు సంఘాలు కూడా ముందుకోచ్చి మరీ కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఏకంగా నిరసనల సెగ ఢిల్లీకి తాకేట్లు చేయాలని అందోళనకు పిలుపునిచ్చాయి.

ఇందుకు 35 ఏళ్ల అనవాయితీని జయలలిత బ్రేక్ చేయడం కూడా కారణం కాకపోలేదు. అందుకనే అమ్మకు తమిళనాడు పెరుగుతున్న అధరణ గత చరిత్రను తిరగరాసేలా వుందని, గతంలో ఇలాంటి పోరబాటు చేయడం వల్లే తాము ప్రతిపక్షానికి పరిమితం అయ్యామని భావించిన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. వారికి అండగా మిగిలిన ప్రతిపక్షాలు అన్ని ప్రజల దృష్టిని మరల్చే పనిలోపడ్డాయా..? అంటే అవుననే సమధానాలు వినబడుతున్నాయి. అయితే వారు గతంలో చేసిన పోరబాటు ఏమిటన్నది అసలు ప్రశ్న.

అక్రమాస్థుల కేసులో జయలలిత అగ్రహార కోర్టుకు హాజరైన క్రమంలో తమిళనాడులో అమ్మ వైపుగా సానుభూతి పవనాలు వెల్లివిరిసాయి. అప్పడు కూడా అపధర్మ ముఖ్యమంత్రిగా పన్నిరు సెల్వం బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో అమె కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారు. అ తరుణంలో అమ్మకు బేషరుతుగా విడిచిపెట్టాలని, లేని పక్షంలో బెంగుళూరు బస్సులు నడవనీయమని తమిళులు హెచ్చరించారు. సరిహద్దు గ్రామాలలో హింస చెలరేగింది.

అక్రమాస్థుల కేసులో జయలలిత దోషిగా నిర్ధారించినా.. తమిళనాట మాత్రం అమ్మకు ఏకపక్షంగా సానుభూతి వెల్లివిరిసింది. ఆ సానుభూతిని అమె గత ఎన్నికలలోనూ వాడుకున్నారు. ఆ పవనాలకు తోడు అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా అమెను ప్రజలు అదరించేందుకు దోహదపడ్డాయి. అయితే ఆ క్రమంలో మౌనంగా వుండటమే తమకు కలసిరాలేదని భావించిన పత్రిపక్షాలు ఇప్పుడు మాత్రం జయలలిత నుంచి దృష్టిని మరల్చేందుకు కావేరి బోర్డు అంశాన్ని నెత్తికోత్తుకుని అటు ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్న చందాన్ని ఫాలో అవుతున్నాయని సమాచారం.

ఇటు జయలలిత నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడంతో పాటు.. అటు కావేరి నీటి వినియోగంలో బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలోనూ నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్న తీరుపై కూడా విపక్షాలు అన్నాడిఎంకే సర్కారు వైఖరిని ఎండగట్టడంలో సఫలం అవుతున్నాయి. ఇక మరో వైపు కేంద్రంలోని మోడీ సర్కారుకు విపక్షాలు అందోళన సెగను తెలియజేయడానికి రైల్ రోకో నిరసనలు దోహడపడాతాయని భావించిన ప్రతిపక్షాలకు కొంత అనుకూలించిందనే చెప్పాలి. మరి ఈ జోరు ఎంత వరకు కొనసాగుతుందన్న విషయం మాత్రం వారికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : River Cauvery  water rights  opposition parties  jayalalithaa health  apollo hospital  

Other Articles