పవన్ వల్ల ప్రాబ్లమ్ ఎవరికయ్యా అంటే... | Pawan kalyan active in AP politics.

Pawan real trouble for ys jagan

Pawan Kalyan, AP Politics, Pawan kalyan TDP, Pawan kalyan YS Jagan, Pawan neutralize Jagan, Pawan kalyan active, Janasena Pawan kalyan, Pawan Kalyan Amaravathi Farmers, Pawan kalyan AP Capital, Pawan Kalyan Land pooling, AP political news

Pawan kalyan active in AP Politics, neutralize YS Jagan.Pawan-TDP Plan To Counter Jagan.

పవనాస్త్రం పక్కా ఫ్లానింగా?

Posted: 01/19/2017 11:53 AM IST
Pawan real trouble for ys jagan

ఓ మీడియా సాక్షిగా ప్రజా సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లటం, వాటిపై స్పందించటం, డెడ్ లైన్ లోపు స్పందించకపోతే పోరాటంకి దిగుతానని ప్రకటించటం, ఆపై సమస్య తీవ్రతరం కాకముందే అధికారపక్షం రంగంలోకి దిగి దిద్దు బాటు చర్యలు చేపట్టం ఇలా సాగిపోతూ ఉన్నాయి ఏపీ రాజకీయాలు. సర్వ రోగ నివారిణి అన్న చందాన ఏ సమస్య వచ్చినా సరే పవన్ ఒక్కడే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడని జనాలు బలంగా నమ్మటమే ఇందుకు కారణమని చెప్పనక్కర్లేదు. ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా వెనువెంటనే వాటికి పరిష్కారాలు దొరకటం వెనుక బోలెడు అనుమానాలు ఉన్నప్పటికీ, మంచి జరుగుతుందన్న చాలన్న ఒక్క పాయింట్ మాత్రం హైలెట్ అవుతోంది.

ఇక ఇదే సమయంలో ఇండైరక్ట్ గా కూడా జగన్ కు చెక్ పడిపోవటం గమనించవచ్చు. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ప్రతిపక్షానికి పనే లేకుండా పోతుంది. రెండున్నరేళ్లలో ప్రతిపక్ష నేతగా జగన్ చేయలేని ఎన్నో పనులను పవన్ చేసి చూపిస్తున్నాడు. అయితే రొటీన్ గా విరుచుకుపడకుండానే తాను చేయాలనుకున్న పనులను కూల్ గా సాధించేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అడ్వాండేజ్ మాత్రం అంతా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్లిపోతుంది.

మెగా అక్వా కల్చర్ ప్రాజెక్టు, ఎవరికీ తట్టని ఉద్ధానవనం కిడ్నీ బాధితుల సమస్యలు ఇలాగే పరిష్కారం అయ్యాయి కూడా. ఇదిలా ఉంటే జగన్ గురువారం నుంచి అమరావతి ప్రాంతంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారమే లింగాయపాలెంకు చెందిన కొంత మంది రైతులు పవన్ ను కలిసి తమ భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పటం విశేషం. వారి గోడును పూర్తిగా విన్న పవన్ సంబంధిత మంత్రులతో మాట్లాడుతానని, రైతుల సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వానికి ఇబ్బందులేం లేవని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. దీంతో విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చంద్రబాబు ఈ విషయంలో కూడా జోక్యం చేసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ చేష్టలతో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటుంది ఎవరయ్యా అంటే అది జగన్ అని మాత్రం ఖచ్ఛితంగా చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  YS Jagan  AP politics  

Other Articles