ఉత్తరప్రదేశ్.. అత్యంత అధిక స్థానాలున్న రాష్ట్రం. సార్వత్రిక ఎన్నికలలో 72 మంది పార్లమెంటు సభ్యలును అందించి కేంద్రంలో మోడీ సర్కారుకు తిరుగులేని మెజారిటీని అందించిన రాష్ట్రం. ప్రస్తుతం ఏడు విడతలుగా జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవాలని పూర్తిగా ఆ రాష్ట్రంపైనే జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీజేపి నేతలందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ గతించిన పార్టీ అంటూ.. ఎస్సీ నేతలది కుటుంబ రాజకీయమంటూ విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపి.. యూపీలో తమ సత్తాను చాటుకోవడంతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహిస్తామని చెబతున్నారు.
ఇంతవరకు బాగానే వున్నా.. కేంద్రంలో నరేంద్రమోడీ సర్కారు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపి ఒక్క చాన్స్ ఇవ్వండీ అనే నానుడి నుంచి అభివృద్ది కోసం తమకు ఓటు వేయాలని చెప్పుకోచ్చింది. దీంతో పాటు దేశంలో అవినీతి లేకుండా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అవినీతి రహిత భారతావని కోసం తమకు ఓటు వేయాలని అర్థించింది. ఢిల్లీలో ఇలాంటి ప్రచారం చేసిన నేతలు చేతులు కాల్చుకున్నారు. ఇక బీహార్ లో జంగిల్ రాజ్ వద్దని, అభివృద్ది కోసం తమకే ఓటు వేయాలని కూడా చెప్పారు. అక్కడ కూడా బీజేపి నేతలకు భంగపాటు తప్పలేదు.
అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో మాత్రం కమలనాధులు తమ సత్తాను మరోసారి చాటుకున్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలకు ఓట్లు వేసి.. దేశాన్ని పేదరికంలోకి నెట్టినట్లేనన్న బీజేపి అభివృద్ది పేరుతో వచ్చిన తమకు పట్టం కట్టాలని చెప్పి మరీ ఓట్ల వేయించుకోవడంలో ఈ రాష్ట్రాల్లో సఫలీకృతులయ్యారు, ఇప్పటివరకు ఎన్నడూ చెప్పని విధంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం కమలనాథులు ప్లేటు ఫిరాయించారు. అవినీతిని, అభివృద్దిని పక్కనబెట్టి.. మరో రాగాన్ని అలపిస్తున్నారు.
ఇంతవరకు బాగానే వున్నా ఇప్పుడు బీజేపి నేతలు అలపిస్తున్న రాగం ఏదీ..? విజయంపై ధీమాను మాట్లల్లో కనబరుస్తున్న నేతలు.. ఒక్కసారిగా ప్లేటును ఎందుకు ఫిరాయించారు.? గత మూడేళ్లుగా ఎన్నడూ అలపించని రాగాన్ని ఎందుకు అందుకున్నారు..? బీజేపి నేతలకు ఎందుకని వణుకు పుడుతుంది..? గెలుపు విషయాన్ని పక్కనబెడితే.. అసలు పరుపైనా దక్కుతుందా,? అన్న అందోళనకు చేరుకున్నారా..? అందుకనే దేశవ్యాప్తంగా తమ ఉనికిన చాటడంతో పాటు.. ఒకప్పుడు పార్టీకి కేంద్ర పీఠాన్ని అందించిన రాగాన్ని అందుకున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చాపకింద నీరులా అటు ప్రచారంలో దూసుకుపోవడంతో పాటు ఇటు విజయతీరాల వైపు పరుగులు తీస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏ దిక్కు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా కమలం పార్టీ పాత రాగాన్ని అలపిస్తుందా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక తమను ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో గట్టెక్కించేది అ రాగమనే వారెందుకు భావిస్తున్నారు. అసలు ఇంతకీ అ రాగమేంటి..?
రామ మందిర నిర్మాణం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే అంశాన్ని గత మూడేళ్లుగా వదిలేసిన బీజేపి.. ఇప్పుడు మళ్లీ అదే రాగాన్ని అలపించడం ప్రారంభించింది, దీంతో పాటు హిందువులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికలలో గెలుపోందాలని భావిస్తుంది, అందుకోసం రామ మందిర నిర్మాణంతో పాటు మళ్లీ హిందుత్వ రాగాన్ని అలపించడం మొదలుపెట్టింది, గోమాంసంపై ఆంక్షలు విధిస్తామని, హిందూ దేవాలయాలకు విమాన సర్వీసులను కల్పిస్తామని, రాష్ట్రంలో రామాలయం నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇవ్వడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది,
అయితే దీనిని కూడా ఎస్సీ-కాంగ్రెస్ కూటములు ధీటుగా ఎదుర్కోంటున్నాయి, కేవలం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చిరాగానే బీజేపికి రామమందిర నిర్మాణం గుర్తుకువస్తుందని దెప్పిపోడిచాయి. గత మూడేళ్లుగా రామ మందిరాన్ని మర్చిపోయిన బీజేపి ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం రాముడికి అసలు వనవాసానికి రెట్టింపు స్థాయిలో వనవాసం కల్పించిందని విమర్శించింది. మతం ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని ఏకంగా ఎన్నికల కమీషన్ హెచ్చరికలు జారీ చేసినా.. అధికారంలో వున్నామన్న ధైర్యంతోనే బీజేపి ఇలా వ్యవహరిస్తుందని చెప్పుకొస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు,
ఇక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరో అడుగు ముందుకేసి మరీ.. లవ్ జిహాద్‌ను ఎదుర్కొనేందుకు రోమియోలను ఆటకట్టించే దండులను ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మరో బీజేపి ఎమ్మెల్యే సురేష్ రాణా తానేం తక్కువ కాదన్నట్లు.. సమసిపోయిన అల్లర అంశాన్ని కూడా మరోమారు తెరపైకి తీసుకోచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలు ఎక్కువగా ఉన్న కైరానా, మొర్దాబాద్‌లలో శాశ్వతంగా కర్ఫ్యూను విధిస్తామని ప్రకటించారు.
దీనికి అసలు కారణం.. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని సమర్థవంతంగా ఎదుర్కోని.. యూపీ పీఠంపై మరోసారి కమల జెండాను ఎగురవేయాలంటే హిందుత్వం తప్ప మరోమార్గం లేదని బీజేపి నేతలు తేల్చుసుకున్నారా..? అందుకనే రామమందిరంతో పాటు హిందుత్వ రాగాన్ని అలపిస్తున్నారా.. అంటే అవుననే స్సష్టం అవుతుంది, అభివృద్ధి నినాదాన్ని అఖిలేష్ గట్టిగా వినిపిస్తుండడంతో ఆ నినాదాన్నే పుచ్చుకునే అవకాశం పార్టీకి లేకుండా పోయింది. ఇక దీనికి తోడు కాంగ్రెస్ నేతలు మోడీ సర్కారు వచ్చిన తరువాత తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చి రాగానే పేదలకు వెన్నుదన్నుగా నిలచిన భూసంస్కరణల చట్టానికి తూట్లు పోడిచారని, రాజ్యసభలో ఈ బిల్లు అమోదాన్ని తాము వ్యతిరేకించడంతో పాటు కేంద్రం రైతు వ్యతిరేక విధానాన్ని దేశ ప్రజలకు అర్ధమైయ్యేట్లు చేశామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున్న రైతులు ఉద్యమ బాట పట్టడంతో చివరికి మోదీ సర్కారు దిగి వచ్చిందని కూడా ప్రచారాన్ని చేస్తున్నారు. దీంతో విజయం నల్లేరుపై నడక అంటూ ఇన్నాళ్లు చెప్పుకోచ్చిన బీజేపి పాత రాగాన్ని అలపించక తప్పని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
* అయితే ప్రధాని మోడీ, బీజేపి నేతలు చెప్పిన మాటలేమయ్యాయి..?
* పెద్ద నోట్ల రద్దును దేశప్రజలందూరూ స్వాగతించారన్న ప్రధాని దానిని ఎన్నికల అస్త్రంగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు.?
* నల్లధనాన్ని దేశం నుంచి తరమికోట్టేశామని ప్రచారం చేయలేకపోవడానికి కారణం ఏమిటీ..?
* అవినీతిని దేశంలో లేకుండా చేశామని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నారు.?
* దేశంలో ఇక నకిలీ కరెన్సీ అన్న విషయాన్ని గొంతెత్తి ఎందుకు చెప్పలేకపోతున్నారు..?
* సార్వత్రిక ఎన్నికలలో చూపిన గుజరాత్ అభివృద్ది ఏమైంది..?
* గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా అభివృద్దిని యూపీలో ఎందుకు చూపలేకపోతున్నారు.?
* స్వచ్ఛా భారత్ ఫలితాలను ఎందుకు ప్రకటించలేకపోతున్నారు..?
* 56 ఇంచుల వెడల్సు ఛాతి సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ఏమైంది..?
* అర్మీలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ఎందుకు ప్రచారాస్త్రాం కాకుండా పోయింది.?
* యూపీలో బాబా రాందేవ్ సేవలను ఎందుకు బీజేపి తీసుకోలేకపోతుంది.?
* డిజిటల్ ఎకానమీ, క్యాష్ లెస్ ఇండియా స్లోగన్లను ఎందుకు పక్కన బెట్టింది..?
* అవినీతి నిర్మూలణ అంటూ బ్యాంకులను కుచ్చుటోపి పెట్టిన వారిని వెసుకేసుకురావడమా..?
* డీఫాల్టర్ గా తేలిన వ్యక్తులను క్యాబినెట్ లో స్థానం కల్పించడమా.?
* డిజిటల్ ఇండియా అంటూ వ్యవసాయ రంగాన్ని విస్మరించడమా.? అన్న ప్రశ్నలు కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more