రాష్ట్ర విభజన జరిగిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ వాసనలు మాత్రం రెండు రాష్ట్రాలను వీడి పోవటం లేదు. 60 ఏళ్ల పోరాట ఉద్యమంలో విజయం సాధించామని ఒకరు, కాంగ్రెస్ అన్యాయంగా విభజించిందని మరోకరు ఇలా రెండు ప్రభుత్వాలు ఇప్పటికీ దంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాయి. పునర్వస్థీకరణ లో లోపాలున్న మాట వాస్తవమే అయినా, ఎక్కువగా నష్టపోయింది ఏపీయే అయినా, కేంద్రం మాత్రం స్వరం మార్చి సాయం విషయంలో వెనకంజ వేయటం దారుణమైన అంశమే. ఇక విభజన అనేది నాణేం అయితే టీడీపీ, టీఆర్ఎస్ రెండు పార్వ్శాలుగా మార్చుకుని మరీ వాడేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ మూడేళ్లలో ఇరు రాష్ట్రాలు సాధించిన ప్రగతి మాట అటుంచి చాలా సందర్భాల్లో విభజన పదాన్ని ఉపయోగించటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లాభపడ్డట్లు భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నుంచే దీనిపై ఎక్కువ ధృష్టిసారించింది. ఛాన్సు దొరికినప్పుడల్లా ఉమ్మడి ఆంధ్రాలో తీరని ద్రోహం జరిగిందని, సొంత రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుకుందామని ఇలా చెప్పుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో వారి యవ్వారం కాస్త కామెడీగా మారుతోంది.
ఇక్కడో ఉదాహరణ చెప్పుకుందాం. రీసెంట్ గా జగిత్యాల జిల్లాలో ప్రగతి సభ జరిగింది. అక్కడ సభలో తెలంగాణకు ఉమ్మడి స్టేట్ లో జరిగిన అన్యాయాల గురించి ప్రసంగించిన నిజామాబాద్ ఎంపీ, కల్వకుంట్ల కవిత చివర్లో జై తెలంగాన అటూ నినాదాలు చేసింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తునే నినాదాలు వచ్చాయి. అయితే ఉద్యమ సమయంలో ప్రదర్శించిన ఆత్మగౌరవ నినాదాన్ని ఇప్పుడు స్వరాష్ట్రం, సొంత ప్రభుత్వంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? అని తోటి నేతలే గొణుక్కుంటున్నారు.
ఇక ఇదే సీన్ ను ఏపీకి మార్చి చూద్దాం. రాష్ట్ర విభజన అన్యాయమని, ఘోరంగా అన్యాయం చేశారని ప్రతీ మీటింగ్ లలో చంద్రబాబు ప్రసంగాలు ఇవ్వటం చూస్తుందే. కానీ, ఇక్కడే ఓ చిక్కు వచ్చి పండింది. ఆయన ఆ మాట అన్న ప్రతీసారీ మీడియాతో సహా అంతా రెండు రాష్ట్రాల్లో వైషమ్యాలు రేపటానికి బాబు ప్రయత్నిస్తున్నాడంటూ విమర్శలు వచ్చిపడుతున్నాయి. సరైన గవర్నెన్స్ లేకపోవటం అనే కారణాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో తప్పు జరిగిన ప్రతీసారి ప్రతిపక్షాలు సులువుగా టీడీపీని టార్గెట్ చేయగలుగుతున్నాయి.
ఆ సమయంలో విభజన అనే సాకును చూపి ఏపీ సీఎం ఆత్మరక్షణ పోరాటం చేస్తుంటే.. అరిగిపోయిన సెంటిమెంట్ అనే అరిగిపోయిన సీడీ ఏస్తూ టీఆర్ఎస్ మాత్రం ఇంకా జనాలను దువ్వులనే ప్రయత్నిస్తోంది. 2019 ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి మరి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more