Shivraj Singh Chauhan begins fast to restore peace దీక్షలు కాదు.. గిట్టుబాటు ధర కావాలి..

Cm shivraj chouhan begins fast farmers call for action

Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan,Mandsaur farmer deaths, shivraj singh indefinite fast, Madhya Pradesh CM, shivraj singh chouhan, peace fast, farmers, indefinite fast, curfew

Chief Minister Shivraj Singh Chouhan is sitting at Bhopal's Dussehra Maidan, where people can discuss their problems with him. He has assured them of all help

దీక్షలు కాదు.. గిట్టుబాటు ధర కావాలి..

Posted: 06/10/2017 01:51 PM IST
Cm shivraj chouhan begins fast farmers call for action

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన చేతిలోని పరిపాలన పగ్గాలను వదిలి.. నిరాహార దీక్షకు పూనుకోవడం పలు అనుమానాలు తావిస్తుంది. తన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి భూపేందర్ సింగ్ చేతిలో వున్న హోం మంత్రిత్య శాఖపై నియంత్రణను కోల్పయారా..? అందుచేతే తన చేయాల్సిన పనిని చేయలేక ఇక ప్రజలు (అన్నదాతలే) శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.

ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, విధులను పక్కనబెట్టి మరీ రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అన్నదాతలు మత ఉద్యమాన్ని వదులుకుని శాంతియుతంగా వుండే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చౌహన్‌ తన భార్య సాధనతో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు దీక్షలో కూర్చున్నారు. భోపాల్‌లోని దస‌రా మైదానంలో దీక్ష కొన‌సాగిస్తున్నారు. కాగా మందసౌర్‌ జిల్లాలో రైతులపై కాల్పులు ఘటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా హింస పెరిగిపోయిన విషయం తెలిసిందే. అక్కడ పోలీసులు రైతన్నల ఉద్యమానికి వ్యతిరేకంగా కాల్పలు జరపడంతో మధ్యప్రదేశ్ లోని జిల్లాల్లో హింస రాజుకుంది.

మరీ ముఖ్యంగా మందసౌర్ జిల్లాలో తమ ఉత్సత్తులకు మద్దతు ధర కల్పించాలని రైతన్నలు డిమాండ్ చేశారు. చిన్నగా ప్రారంభమైన ఉద్యమం క్రమంగా రైతన్నలందరూ మద్దతు ప్రకటించడంతో పెద్దగా పెరిగిపోయింది. వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అణిచివేయాలని చూసింది. రైతన్నలపై లాఠీచార్జులకు బదులు ఏకంగా తుపాకుల తూటాకలను ఎక్కుపెట్టి ఐదుగురు రైతుల ప్రాణాలను బలిగొనింది. దీంతో రైతన్నల్లో అక్రోశం ఎగసిపడింది. తాము మద్దతు ధరను కోరుతుంటే ప్రభుత్వం తమ ప్రాణాలనే బలికోరుతుందని తిరగబడ్డారు.

ఈ నేపథ్యంలో పక్క జిల్లాలకు కూడా రైతుల ఉద్యమం పాకింది. దీంతో అల్లర్లు చెలరేగిన ప్రాంతమంతా కర్ప్యూతో అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. అయినా రైతన్నల అక్రోశం తగ్గడం లేదు. దీని ఫలితంగా అక్కడక్కడా ఇంకా రైతన్నల అగ్రహం వెల్లగక్కుతూనే వున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకగా నిరాహార దీక్షకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతన్న డిమాండ్ నిజంగా ప్రభుత్వం తలొగ్గితే కేంద్రంలో వున్న తమ పార్టీకి చెందిన నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి.. వారికి గిట్టుబాటు దర కల్పించాలే తప్ప.. దీక్షలు చేస్తే ఏం లాభంమన్న విమర్శలు కూడా వినిసిపిస్తున్నాయి.

రైతన్నలపై ఒ వైపు తుపాకులు ఎక్కు పెట్టించి రాష్ట్రంలో రావణకాష్టాన్ని రాజేసిన శివరాజ్ సింగ్ ప్రభుత్వం.. మరోవైపు వారినే సదరు పరిణామాలకు బాధ్యులుగా చేస్తూ.. వారు శాంతించే వరకు తాను నిరాహార దీక్షను చేపడుతున్నానని ప్రకటించి దీక్షకు కూర్చోవడం కూడా విమర్శలకు తావిస్తుంది. రైతులపై నిజంగా ముఖ్యమంత్రికి, లేదా రాష్ట్రంలోని బీజేపి ప్రభుత్వానికి ప్రేమ వుంటే.. దీక్షలతో కాకుండా వారి డిమాండ్లను నెరవేర్చి ప్రేమను చాటుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh CM  shivraj singh chouhan  peace fast  farmers  indefinite fast  curfew  

Other Articles