నాటకీయ పరిణామాల మధ్య ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన నటుడు విశాల్ నామినేషన్ ను పున:పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుందా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. విశాల్ చేసిన విమర్శలకు దిగివచ్చిన ఎన్నికల సంఘం ఆయన సమర్పించిన నామినేషన్ ను మరోమారు పరిశీలించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా చేయడానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి అవకాశం లేనప్పటికీ.. కోలీవుడ్ ప్రముఖ హీరోగా అవతరించిన విశాల్ ఈ విషయంలో చేసిన అరోపణలు, విమర్శలకు జడిసిన ఎన్నికల సంఘం తమకు అపఖ్యాతి మూటగట్టుకోవడం ఇష్టంలేక.. రాజ్యంగంలోని అర్టికల్ 324 మేరకు వెసలుబాటును అందిపుచ్చుకుని మరీ విశాల్ నామినేషన్ ను పున:పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే విశాల్ ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ అధికారి రాజేష్ లోహానీని కూడా కలసి తన నామినేషన్ పత్రతాను ఎందుకు తిరస్కరించారో తెలిపాలని పిటీషన్ దాఖలు చేశారు. దీంతో పాటు ఆయన పిటీషన్ ను పరిగణలోకి తీసుకుని అమోదిస్తున్నామని చెప్పిన ఎన్నికల స్ర్కూటినీ అధికారుల చెబుతున్న వీడియోను కూడా సాక్ష్యంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ఈసీపై విమర్శలు, అరోపణలు అధికమయ్యాయి ఈ నేపథ్యంలో ఈసీ విశాల్ నామినేషన్ ను పున:పరిశీలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయన తన నామినేషన్ విషయమై ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతుల దృష్టికి సామాజిక మాద్యమం ద్వారా తీసుకెళ్లారు. ఇక మంగళవారం తన నామినేషన్ విషయంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని తీవ్రస్థాయిలో స్పందించాడు. ప్రజాస్వామ్య దేశంలో ఓ యువకుడు స్వంతంత్రంగా పోటీచేస్తే.. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం సినీఫక్కీలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలకు విశాల్‌తో పాటు తమిళనాడు ప్రజలను కూడా గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో క్రితం రోజున విశాల్ మరో సవాల్ చేశారు. తన నామినేషన్ ను విత్ డ్రా చేయించినంత మాత్రం నష్టం లేదని, తాను ఓ స్వతంత్ర అభ్యర్థిని ఎంచుకుని అతనికి విజయాన్ని కట్టబెట్టి.. అతని ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. అయితే అతని వ్యాఖ్యల నేపథ్యంలో కూడా శరవేగంగా మార్పులు సంభవించి.. అతని నామినేషన్ పున:పరిశీలనకు ఈసీ అదేశించనుందా..? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more