తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అమె మరణానంతరం వెలువడిన తీర్పులో దోషిగా నిర్ధారించబడి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ కార్యదర్శ శశికళకు రాజబోగాల కల్పనలో ఏకంగా ఓ ముఖ్యమంత్రి ప్రమేయమే వుందా.? అంటే అవునన్న అరోపణలు వినబడుతున్నాయి. అమెంటే అంత ప్రమే వున్న ముఖ్యమంత్రి ఎవరా అంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. శశికళకు జైలులో రాజభోగాలను అందిస్తున్నారన్న అంశం ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు కర్ణాటకలోనూ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
బెంగళూరులోని పరప్పనా అగ్రహార జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీజీపీ హెఛ్ఎన్ఆర్ రావు వ్యాఖ్యాలు ఇప్పుడు తీవ్ర దూమారాన్ని రేపాయి. శశికళకు రాజభోగాలను అందించాలని సీఎం అదేశించారని.. ఆయన తాజాగా చేసిన అరోపణలు రాజకీయవర్గాల్లో దూమారాన్నే సృష్టిస్తున్నాయి. అయితే హెచ ఎన్ ఆర్ రావు ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తమిళనాడుకు చెందిన ఓ బృందం తన వద్దకు వచ్చిన శశికళకు జైలులో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తన దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు.
ఈ క్రమంలో తాను అమెకు జైలు నియమనిబంధనలకు లోబడి అమెకు సౌకర్యాలను కల్పించాలని మాత్రమే జైళ్ల శాఖ అధికారులను అదేశించానని చెప్పారు. అయితే అదేశాలకు వక్రబాష్యం చెబుతూ.. శశికళకు సకల సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించానని తప్పుడు అరోపణలు చేయడం సముచితం కాదని అన్నారు. జైళ్ల శాఖపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించడంతోనే మాజీ డీజీపీ హెచ్ ఎన్ ఆర్ రావు తనపై ఈ ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు.
ఇక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం డీజీపిపై మరో విధమైన అరోపణలు సంధిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికల వాతావరణం అప్పుడే అలుముకుందని, ఈ క్రమంలో పదవి నుంచి రిటైర్ అయిన మాజీ డీజీపీ రావు.. బీజేపి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ అశిస్తున్నారని అందుచేతనే ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని అరోపిస్తున్నారు. టిక్కెట్ తప్పకుండా దక్కేందుకు బీజేపి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే.. మాజీ డీజీపీ ఇలాంటి చౌకబారు అరోపణలకు పాల్పడుతున్నారని అరోపిస్తున్నారు. అయితే నిజానిజాలను వెలిసితీయాల్సిన తరుణంలో.. ఏకంగా పరిపాలనకు సంబంధించిన అంశంలోనూ రాజకీయాలు జోక్యం చేసుకుని తమ ఉనికి చాటుకుంటున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more