chitoor TDP leader to join Janasena.? జనసేనలోకి సీనియర్ టీడీపీ నేత.. పవన్ సమ్మతి.?

Chitoor senior tdp leader to join janasena

pawan kalyan, janasena, chitoor, chadalavada krishna murthy, TDP, chadalavada krishna murthy to join JanaSena, pawan kalyan porata yatra, pawan kalyan press meet, Pawan Kalyan rayalaseema yatra, andhra pradesh, politics

As actor turned politician pawan kalyan party Jana Sena recieving huge response from youth, leaders are getting attracted to the power star party, Now there are gossips that chitoor TDP Leader chadalavada krishna murthy to join JanaSena.

జనసేనలోకి సీనియర్ టీడీపీ నేత.. పవన్ సమ్మతి.?

Posted: 09/21/2018 11:24 AM IST
Chitoor senior tdp leader to join janasena

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీకి ప్రజల్లో వున్న ఆదరణను వీక్షిస్తున్న నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి చేరువయ్యేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికీ అధికార పక్షానికి చెందిన కొందరు నేతలతో పాటు ఇటు విపక్షానికి చెందిన నేతలు పలువురు జనసేనాని పవన్ కల్యాణ్ ను కలసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మరికోందరు కూడా అదే బాటలో పయనించనున్నారు.

పవన్ కల్యాణ్ తాను కేవలం ప్రజలకు సేవ చేసేందుకే వస్తున్నానని, డబ్బును అర్జించేందుకనో, లేక అధికారంపై వ్యామోహంతోనే తాను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పడంతో.. ఆయనకు జనసేనకు యువత ఆదరిస్తున్న క్రమంలో నేతలు కూడా అటుగా మొగ్గుచూపుతున్నారు. ఈ జాబితాలో క్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా అధికార టీడీపీ కార్యక్రమాలకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న చదలవాడ హఠాత్తుగా గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలవడం చర్చనీయాంశమైంది. జనసేనాని ఇచ్చిన హామీతో విజయదశమికి ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఇదే నిజమైతే తిరుపతి పట్టణంలో జనసేన పార్టీకి పెద్ద దిక్కు లభించినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chitoor  chadalavada krishna murthy  TDP  andhra pradesh  politics  

Other Articles