రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్రంలోని తమ పార్టీ సీనియర్ నేతలను సైతం కలవరానికి గురిచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన నేతలపై సర్వేలు చేయించిన పార్టీ.. అనేక స్థానాల్లో సమన్వయ కర్తలను మార్చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నాయకత్వంపై కూడా సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం.
దీంతో సత్తెనపల్లి అసెంబ్లీ స్థానంలో కూడా నాయకత్వ మార్పు చేయాలని వైసీపీ అధిష్టానంలో యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ సత్తెనపల్లిలోని పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేలో అంచానాలు ఎలా వున్నాయో తెలుసుకున్న వైసీపీ అధిష్టానం.. పార్టీని పరుగులెత్తించడం విఫలం అయ్యాడంటూ అంబటి రాంబాబు నాయకత్వం పై అసంతృప్తితో వుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనకు రానున్న ఎన్నికలలో షాక్ ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యిందని సమాచారం.
వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వలలో అంబటి రాంబాబుపై పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నట్టు ఫలితాలు వచ్చాయిని.. దీంతో ఆయనకు సత్తెనపల్లి సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా తప్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. 2014లో స్వల్ప మెజారిటీతో పరాజయం చవి చూసినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో అంబటి దారుణంగా విఫలమైనట్టు పార్టీలో పెద్దల మధ్య కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది. అయితే అంబటి రాంబాబు విషయంలో పునరాలోచనలో పడ్డ పార్టీ అధిష్టానం అందుకు బలమైన వర్గం నుంచి నేతలను బరిలోకి దింపాలని కూడా ప్రతిపాదనలో వుందని సమాచారం.
గుంటూరు జిల్లాలో మైనారిటీలు అధికంగా వున్నందున వారిని కూడా ఆదరించాలని.. తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ జనసేన భావిస్తున్న క్రమంలో అందోళనలో పడిన వైసీసీ మైనారిటీ వర్గాలను అకర్షించేందుకు అటువైపుగా దృష్టిసారించిందన్న వార్తలు వినబడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పిఎసి కమిటీ నిజాయితీ గల మైనారిటీ నేతలను గుర్తించి.. వారినిరాష్ట్రస్థాయి నేతలుగా ప్రోత్సహించాలన్న నిర్ణయం కూడా తీసుకుంది.
ముఖ్యంగా మైనారిటీ ఓట్లు అధికంగా వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనారటీ నేతలను ప్రోత్సహించేందుకు జనసేన రాజకీయ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జనసేన మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపుతుందని సమాచారం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 9 వేల ఓట్లు వుండగా, అందులో దాదాపుగా 33 వేల ఓట్లు మైనారిటీలవే. దీంతో ఈ స్థానాన్ని గెలుపొందేందుకు ముస్లిం నేతనే తమ పార్టీ తరపున బరిలోకి దింపాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని తెలుసుకన్న వైసీపీలో అందోళన చెందుతుందని.. దీంతో అలోచనలో పడ్డ అధిష్టానం.. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి అంబటి రాంబాబును తప్పించి ముస్లిం అభ్యర్థిని ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే అధికారంలోకి వస్తే.. అంబటి రాంబాబుకు నామినేటెడ్ పదవి కల్పించాలని కూడా నిర్ణయించిందట. అయితే ఇప్పటికే పార్టీలో అధికార ప్రతినిధి హోదాను కల్పించిన అధిష్టానం.. పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అంబటి రాంబాబు.. అధిష్టానానికే సూచనలు చేస్తున్నారట. నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు అందరూ తన చేతిలోనే వున్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని ధీమాను కూడా వ్యక్తం చేశారట. తనకు ఇవ్వాలని భావించే నామినేటెడ్ పదవిని ముస్లిం నేతలకు కేటాయిస్తే సరిపోతుందని కూడా అధిస్టానం దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. ఇక నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎవ్వరూ ఎమ్మెల్యే పదవికి పోడిపడే స్థాయిలో కూడా లేరని ఆయన అధిష్టానానికి చెప్పారని తెలుస్తుంది.
ఇక దీనికి తోడు ముస్లింలకు టికెట్ ఇస్తే సాధారణ ప్రజలు ఎవరు ఓట్లు వేయరని కూడా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తుంది. అయితే ముస్లింలకు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవినిచ్చి సరి పెట్టొచ్చని కూడా అంబటి రాంబాబు అధిష్టానానికి సూచించారని తెలుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం అంబటి రాంబాబును సమన్వయకర్తగా ప్రకటించినా.. అతన్ని సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు అలోచనలో పడిందని తెలుస్తుంది.
టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ వంటి బలమైన అభ్యర్థిని ఎదుర్కోవడం అంబటి వల్ల కాదని వైసీపీ అధిష్టానం సందిగ్ధంలో పడిందని సమాచారం. సత్తెనపల్లి స్థానం నుంచి అంబటిని బరిలో దింపకపోతే ఆయన చేసే ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలి.. ఆయనను ఎలా సముదాయించాలన్న విషయాలపై కూడా వైసీపీ అధిష్టానం ముందుచూపుతో వ్యవహరిస్తుందని తెలుస్తుంది. అయినా అంబటి తమ దారికి రాకపోతే సీటు వదులుకోవడం లేదా అంబటిని వదిలించుకోవడమా అనే మీమాంసలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
అయితే సత్తెనపల్లి నుంచి ఈ సారి బరిలోకి దిగే అవకాశం వస్తే తమకు తమ వర్గం వారు తప్ప మిగతా నేతలెవ్వరూ ఓట్లు వేయరని అంబటి రాంబాబు వైసీపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న వార్తలు తెలుసుకున్న మైనారిటీలు అంబటిపై అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తమ ఓట్లతో అంబటి రాంబాబు లాంటి నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు.. కానీ మేము మాత్రం రాజకీయాలకు పనికిరామా.? అంటూ మండిపడుతున్నారు.
అంబటి రాజకీయ జీవితం లోటస్ పాండ్ లో ముగియనున్నట్లు కూడా వారు శాపనార్థాలు పెడుతున్నారట. తమ వర్గానికి చెందినవాళ్లు ఎమ్మెల్యేలుగా ఎదగడం ఇష్టం లేక అంబటి అధిష్టానం వద్ద ఇలా విమర్శలు చేస్తున్నారని ముస్లిం నేతలు ఒంటికాలుపై లేస్తున్నారు. రాష్ట్రంలో పలు అసెంబ్లీ స్థానాల్లో.. ప్రజల ఓట్లు వేయకపోతే.. మైనారిటీ నేతలు ఎలా ఎమ్మెల్యేలు అవుతున్నారని.. కూడా ముస్లిం నేతలు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more