rajagopal reddy to join ruling trs party.? టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Komati reddy rajagopal reddy to join ruling trs party

Komati Reddy RajaGopal Reddy, RajaGopal Reddy to join BJP, RajaGopal Reddy to join TRS, Harish Rao, Congress MLA RajaGopal Reddy, Komati reddy RajaGopal Reddy to join TRS, Komati Reddy RajaGopal Reddy, Congress MLA, BJP, TRS, UTurn, Telangana, Politics

Congress MLA komati reddy rajagopal reddy, who had made his way to join central ruling party BJP, had taken an U turn and now he is knocking the doors of state ruling pary TRS.

టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

Posted: 09/17/2019 04:15 PM IST
Komati reddy rajagopal reddy to join ruling trs party

తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం చెప్పలేదు. ఇలోగా తాను అర్జునుడినని యూటార్న్ తీసుకున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరాలని భావిస్తున్నారా.? అంటే ఔనన్న సంకేతాలే వినబడుతున్నాయి.

ఎందుకంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే వారి మధ్య ఏం చర్చలు జరిగివుంటాయన్న ప్రశ్నలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.

వారిరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై వంటి అంశాలపై చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఒకసారి ఉండలేనని మరోసారి చెప్తూ నానా హంగామా చేస్తున్నారు. బీజేపీలో చేరడం ఖాయంగా మారిందనుకున్న సమయంలో మళ్లీ యూటర్న్ తీసుకున్న.. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. అనంతరం అనేక మార్లు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
 
అయితే తాజాగా టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి కారెక్కుతారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.  ఇంతకీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక బీజేపీలో చేరతారా....? బీజేపీలో చేరే వ్యూహం బెడిసి కొట్టడంతో టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారా ....? ఇవే ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Komati Reddy RajaGopal Reddy  Congress MLA  BJP  TRS  UTurn  Telangana  Politics  

Other Articles