ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి కన్నా జనసేన నుంచే ఎక్కువగా విమర్శలు ఎదురవుతున్నాయి. పైపైన వాటిని తమ నేతల ప్రతివిమర్శలతో కౌంటర్ ఇప్పిస్తూన్నా.. లోలోన మాత్రం జనసేనను ఢీకొట్టేందుకు గట్టి వ్యూహ ప్రతివ్యూహాలు రచించాలని ప్రయత్నాల్లో ఆ పార్టీ శ్రేణులు మునిగారని తెలుస్తోంది. అయితే అవినీతి, కులం, మతం. ప్రాంతం లాంటి భేషజాలు తనకు లేవని చాటుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అవే టార్గెట్ గా ఎంచుకుని.. తాజాగా పవన్ నాయుడు అంటూ కూడా విమర్శలు చేస్తున్నా.. వాటిని ప్రజలు విశ్వసిస్తారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ తరుణంలో పవన్ కల్యాణ్ పై విమర్శలతో తమను తాము సంతృప్తి పర్చుకోవడం కన్నా.. వాటిని ఎంత బలంగా తమ మీడియా చేత రాయించినా.. పవన్ కల్యాణ్ కు అంతకుముందు నుంచి వస్తున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయలేమని వైసీపీ నేతలకు అర్థమైంది. అయితే పది మార్లు పది మందితో అదే ప్రచారం చేయిస్తే.. అబద్దం కూడా నిజమవుతుందని అధికార పక్షం ఫీలింగ్ లా వుంది. ఇది అందరి నాయకులు విషయంలో రైటు అవుతుందేమో కానీ పవన్ విషయంలో మాత్రం మిస్ ఫైర్ అవ్వక తప్పదు.
ఎందుకుంటే.. జనసేనాని ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇస్తే అప్పటి వరకు ఎదుటి వారు నిర్మించిన అబద్దపు సామ్రాజ్యపు గోడలన్ని పేక మేడల్లా పెకిలించబడతాయన్నది అక్షర సత్యం. ఇంతక్లారిటీగా చెప్పడం వెనుకు ఆయన నిజమైన శైలి కనబడుతోంది. కులం ఓట్ల కోసమే.. మతం మతలబుల కోసమో తాను రాజకీయాలు చేయనని ఆయన ఇప్పటికే పలు పర్యాయాలు స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. అయినా పవన్ కల్యాన్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు పవన్ నాయుడు అంటూ టీడీపీతో అంటకాగుతున్నారని విమర్శలు చేయడం మాత్రం మానడం లేదు.
ఇక వైసీపీ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తే.. అందుకు వైసీపీ నేతలు విమర్శలను గుప్పించడం పరిపాటిగా వస్తోంది. కానీ జనసేన అధినేతపై వచ్చే విమర్శలకు నేరుగా ఆయనే సమాధానం ఇవ్వడం.. అక్కడితో సమస్యను పరిష్కరించే విధంగా వుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కల్యాన్ వైసీపీ నేతలను వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ఘాటుగా ప్రతిసవాల్ విసిరారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగితే.. తాను దిగుతానని, కొంత స్థాయి.. సంయమనం పాటిస్తే మంచిదని కూడా సూచించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో సెల్ప్ గోల్ చేసుకున్న వైసీపీ ఆయనను ఎలా ఢీ కొట్టాలన్న యోచనలో వుంది. పవన్ పై తన మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో విమర్శలు చేయిస్తూనే.. పైపైన గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. లోలోన మాత్రం పవన్ కల్యాణ్ ఎలా ఎదుర్కోవాలా.? అన్న అంశాలపై పార్టీ మేధోవర్గం మధనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మంచి వ్యక్తి అని, ఆయన ఔదార్యం. గుణం, గోప్పదనం గురించి ఇప్పటికే రాష్ట్రమంతా అభిమానులు చాటుతున్నారు. ఇక దానికి తోడు ఆయన చేస్తున్న గుప్తదానాలు.. ఎందరికో జీవితాన్ని కూడా ఇచ్చాయన్న కథనాలు.. ఆయనపై రాజకీయ పార్టీలు వేసే విమర్శలను బదులిస్తూనే వుంటాయి. ఈ క్రమంలో అధికార పక్ష మేధోమథనం ఎంతమేరకు పవన్ ను కట్టడి చేసేందుకు దోహదపడుతుందో వేచి చూడాల్సిందే.!
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more