సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన అధికారులు.. శాఖపరమైన విచారణను జరిపించిన తరువాత విధుల్లోకి పంపుతారని పలువురు అభిప్రాయపడుతున్నా.. ఇది కేవలం వారం.. పది రోజుల చర్యలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు జిల్లా ఎస్సీ వ్యాఖ్యలనే వారు కోట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డికి అడ్డుకుంటున్నది అమె తండ్రి అని తెలియకుండానే అతడ్ని తన్నాడని సమర్ధించడమే ఈ అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
అసలు పోలీసులు చేయిచేసుకోవడమే తప్పు అని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు ఓ వైపు ఘోషిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. ఇక ఈ విషయాన్ని పక్కనబెట్టిన జిల్లా ఎస్సీ కానిస్టేబుల్ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూనే.. అతనికి విషయం తెలియకుండానే మృతురాలి తండ్రిని తన్నాడని అన్నారు. శాఖపరమైన విచారణ జరపిన తరువాత కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై చర్యలు వుంటాయని అన్నారు. ఇక ఆత్మహత్య చేసుకన్న విద్యార్థిని సంధ్యరాణి కేసులోనే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు దర్యాప్తు కోనసాగుతుందని అన్నారు.
హైదరాబాద్ శివార్లలోని తెల్లపూర్ పురపాలక సంఘం పరిసదిలోని ఈదుల నాగులపల్లి గ్రామ పరిధిలోని నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పదంగా మరణించింది. పటాన్ చెరువులోని ప్రభుత్వ అసుపత్రి మార్చురీలో సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు భద్రపర్చగా, దానిని ఏబివీపి విద్యార్థి సంఘాల నేతలు, మృతురాలి బందువులు జాతీయ రహదారిపైకి తీసుకువచ్చి నిరసనకు దిగుదామని భావించిన అమె తండ్రిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంధ్యారాణి తండ్రిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా అతడ్ని బూటుకాలుదో తన్నిన కానిస్టేబుల్ పై విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.
#WATCH Telangana: Police personnel kicks father of a 16-yr-old girl who allegedly committed suicide on Feb 24 in her hostel in Sangareddy reportedly because college mgmt did not allow her to go home, although she was ill. A probe has been ordered against the personnel. (26.02) pic.twitter.com/OtxKYDMQ8Z
— ANI (@ANI) February 26, 2020
తన కూతురిని పొగొట్టుకుని పుట్టెడు గర్భశోకంలో వున్న ఆయనను.. పోలీసులు డొంకలో తన్నడమేంటని నెట్ జనులు విమర్శలు చేయడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీల దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతి ప్రదర్శించాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ట్వీట్ చేశారు.
అయితే ఆ తండ్రిని తన్నిన ఘటననే ప్రధానంగా శీర్షికలకు ఎక్కిందే తప్ప.. కార్పోరేట్ కాలేజీల్లో ఇలాంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయన్న అంశంలో మాత్రం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం .తీసుకున్న ధాఖలాలు లేవు. నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయిత్రి, ఇలా రాష్ట్రంలో ఇంటర్ విద్యను వ్యాపారంగా మార్చిన కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థులు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారన్న విషయమై ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టిసారించింది లేదు.?
ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు తీసుకున్న పాపన పోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దిశగా కూడా అలోచించాలని పలువురు కోరుతున్నారు. కాగా. ఇంటర్ విద్యను కూడా ఆన్ లైన్ కౌన్సిలింగ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణవాసులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more