మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం సహా పలువురి నుంచి ప్రశ్నల లేవనెత్తడంతో ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా.. వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శల నేపథ్యంలో తన పీఎం కేర్స్ ఫండ్ వివరాలను బయటపెట్టారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయక నిధి (పీఎంఆన్ఆర్ఎఫ్) ఉండగా.. దానిని కాదని ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చి 28న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన తరుణంలో దేశప్రజలతో పాటు పలువురికి ఆయన ఈ నిధి నుంచే విరాళాలు అందజేసేందుకు వీలుగా పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. అయితే పీఎం కేర్స్ నిధి చట్టబద్ధతపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది.
ప్రభుత్వం ఏర్పర్చిన ఇతర సహాయక నిధులు బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉండగా వాటిని కాదని, ‘‘ పీఎం కేర్స్’’ పేరిట మరో నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా విరాళాలు అందజేయడం ఏంటని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన కేంద్రం ... పీఎం కేర్స్ నిధి ప్రజలు తమంతట తామే ఇచ్చే విరాళాలతో నడుస్తుందని తెలిపింది. కాగా, పీఎం కేర్స్ ఆడిట్ వివరాల ప్రకారం.. ఈ నిధికి రూ.3,075.85 కోట్లు దేశీయ విరాళాలు కాగా.. విదేశీ విరాళాలు రూ. 39.67 లక్షల మేరకు లభించాయని తెలుస్తోంది. దీంతో మొత్తంగా పీఎం కేర్స్ నిధిలో రూ. 30.76 కోట్ల రూపాయలు వున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో మరో అడుగు ముందుకేసిన చిదంబరం పీఎం కేర్స్‌కు చైనా నుంచి విరాళాలు అందాయని అరోపించారు.
కేంద్రం తన నిజాయితీని నిరూపించుకోవాలని భావిస్తే.. ఎన్ని విరాళాలు వచ్చాయి.. ఎవరెవరికీ వెళ్లాయి అన్న వివరాలతో పాటు దేశీయంగా విరాళాలు ఇచ్చిన దాతల పేర్లతో పాటు వీదేశీ దాతల పేర్లను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అరోపణలపై ఇప్పటివరకు కేంద్రం స్పందించక పోవడం గమనార్హం. అయితే కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ, 3000 నిధులు పీఎం కేర్స్ ఫండ్ కు అందడంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ఇక దీనికి తీడు ఈ నిధులను విరాళంగా ఇచ్చిన దాతల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పడం కూడా ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది. ఇక ప్రధాని కార్యాలయం అధికారులే ఆడిట్ నివేదికలపై దస్తూరీ చేయడం కూడా విమర్శలకు బలాన్ని చేకూర్చుతుంది.
ఇక ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ ఫండ్ ప్రజా అధికారంతో కూడుకున్నది కాదని కేంద్రం ప్రకటించడం ప్రశ్నలకు తావిస్తోంది. ప్రజలకు విరాళాలు అందించే ఈ నిధి.. ప్రజలకు దాతల వివరాలను వెలువరించకపోవడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇటు ఫీఎం కేర్స్ ఫండ్ కానీ లేదా అటు పీఎంఎన్ఆర్ఎస్ కానీ సమాచార చట్టం హక్కు కిందకు రాదని కేంద్రం తాజాగా చెప్పడం కూడా చిదంబరం అరోపణలకు బలాన్ని చేకూర్చుతుంది. ఇక సరిగ్గా వీటిపై చిదంబరం నుంచి విమర్శలు ఎదుర్కోంటున్న తరుణంలోనే ఈ వివరాలను కేంద్రం వెల్లడించింది. బాలికా విద్య నుంచి గంగా నదిని ప్రక్షాళన కార్యక్రమం వరకు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత సహాయాన్ని అందించారని వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ప్రధాని తన వ్యక్తిగత సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.103 కోట్ల మేర సహాయం అందించారు, ‘పీఎం కేర్స్ నిధి’ ఏర్పాటుచేసిన తొలినాళ్లలో రూ.2.25లక్షలను అందచేసిన ప్రధాని.. గత సంవత్సరం ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో విధులు నిర్వహించిన పారిశుధ్య సిబ్బంది సంక్షేమం కోసం మోదీ రూ.21 లక్షలు విరాళం ఇచ్చారు. దక్షణ కొరియా అందించే సియోల్ శాంతి బహుమతి ద్వారా లభించిన రూ.1.3 లక్షల బహుమతి మొత్తాన్ని గంగా నది ప్రక్షాళన కార్యక్రమం ‘నమామి గంగే మిషన్’కు విరాళంగా అందచేశారు. అంతేకాకుండా తనకు లభించిన మెమెంటోలు, తదితర వస్తువులను వేలం వేయగా వచ్చిన మరో రూ.3.40 కోట్ల మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమానికే అందచేశారు. 2015లో తనకు లభించిన వివిధ బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.8.35 కోట్లను నమామి గంగే మిషన్‌కు ఇచ్చారని వెబ్ సైట్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more