తెలంగాణలో ఓ మహిళకు మంత్రి పదవి లభించడానికి ఏకంగా అరేళ్ల సమయం పట్టిందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా వైఎస్ షర్మిల చేసిన తీవ్ర విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిదాడి చేయలేని స్థితిలోకి జారుకుంది. అలాంటి తరుణంలో మరోమారు ఇలాంటి ఏ తప్పిదం చోటుచేసుకోకుండా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే బిగ్ బాస్ 4 ఫైనల్ పార్టిసిఫెంట్స్ లో ఒకరైన దేతడి హారికకు పరాభవం కలిగించడం మరోమారు చేజేతులా విపక్షాలకు విమర్శనాస్త్రాన్ని అందించడమే.
ప్రపంచ మహిళా దినోత్సవరం సందర్భంగా తెలంగాణకు చెందిన యువతి, బిగ్ బాస్ ఫైనలిస్ట్ పార్టిసిపెంట్, యూట్యూబర్ దేతడి హారికను తెలంగాణ పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా అమెను.. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా అమెను సత్కరించడంతో పాటు అమెకు నియామకపత్రం కూడా ఇచ్చారు. అయితే ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం ఇవ్వదని, వారి నిర్ణయాలను పెద్దగా పరిగణలోకి తీసుకోదని విమర్శలు వస్తున్న తరుణంలో.. కేవలం పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ కు.. సమాచారం ఇవ్వకపోవడంతో ఆమెను తొలగించడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిబడతున్నాయి.
పర్యాటక శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగిన నేపథ్యంలో అదే శాఖలో మంత్రివర్యునితో పాటు చైర్మన్ కు మధ్య వున్న లుకలుకలు కూడా బయటపడుతున్నాయి. ప్రభుత్వంలోని శాఖల మధ్య సమన్వయం ఉండదనే తెలిసిన రాష్ట్రప్రజలకు.. ఇప్పుడో తాజా విషయం కూడా తెలిసిందే. ఒక శాఖలో మంత్రికి అదే శాఖలోని చైర్మన్ కు కూడా సమన్వయం ఉండకపోవడం గమనార్హం. ఇక ఒకే శాఖకు చెందిన వీరిద్దరి సమన్వయ లోపం మేరకు నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ నిర్ణయాన్ని. పరువును.. ప్రజల్లో ఎదురయ్యే వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోవాల్సివుంది.
కానీ అలా కాకుండా ఆఘమేఘాల మీద దేతడి హారిక పేరును పర్యాటక శాఖ వైబ్ సైట్ నుంచి తొలగించేశారు. ఇలా కాకుండా.. వారిద్దరూ తరువాతైనా సమన్వయంతో నిర్ణయానికి కట్టుబడి వుండివుంటే బాగుండేదన్న సూచనలు వస్తున్నాయి. ఉప్పాల శ్రీనివాస్ గుప్తా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు కానీ అతని ఒంటరి నిర్ణయమని ఎవ్వరూ అనుకోరు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించివుంటే ప్రభుత్వం అబాసుపాలు కాకుండా పరువు నిలబడేది. ఇప్పటికే మహిళల విషయంలో నలువైపుల నుంచి విమర్శలను ఎదుర్కోంటున్న తెలంగాణ సర్కార్.. హారిక నియామకం రద్దుతో..భవిష్యత్తులో పలు నిర్ణయాలను కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం వస్తే ఇదే స్పీడులో చేయాల్సిన వస్తుందన్న విషయం తెలియంది కాదు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more