శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా… పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… నీవే శరణమయ్యా… ఓ యాదగిరీ నరసింహా… లక్ష్మీ నరసింహా.. అంటూ భక్తులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి.. తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న మహాపుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు విచ్చేస్తారు. ఈ కోండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. జ్వాలా నరసింహుడిగా వెలసిన స్వామికి తమ భక్తితో మొక్కి.. తమ కోర్కెలను చెప్పుకుంటారు. తమ బాధలను తీర్చాలని కూడా వేడుకుంటారు. తమ కష్టాలను తొలగించాలని మనవిచేసుకుంటారు.
ఇక చాలా మంది భక్తులకు తెలియని విషయం.. త్రినేత్రం చిత్రంలోని పాటలో ఆలపించినట్టుగానే ఈ కొండపై వెలసిన యాదాద్రి నరసింహుడు నిజంగానే విశ్వవైద్యుడై భక్తులకు రోగాలను నయం చేస్తాడు. ఈ విషయాన్ని ఆలయంలోనే ఉంటూ మడితో నిష్టగా మండల పూజలు చేసే భక్తులను అడిగితే తప్పక చెబుతారు. ఇక్కడ మండల పూజ చేసే భక్తులు ప్రతిరోజు మూడు పూటలా స్వామివారిని దర్శించుకుని హారతులను సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది. అయితే ఆలయ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనూ మండల పూజ చేస్తున్న భక్తులు అవస్థలు పడుతూనే తమ దీక్షలను కోనసాగిస్తున్నారు.
ఇక ఆలయం చుట్టూ గిరి ప్రదిక్షణం కూడా వీరు చేస్తుంటారు. ఆ దేవదేవుడే వారి కలలో సాక్షత్కారించి గిరి ప్రదిక్షణం చేయాలని అదేశిస్తారని.. అయితే ఒక్కసారి ఒక్కోరూపంలో వచ్చి భక్తులకు సూచనలు చేస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక ప్రస్తుతం దేవాలయంలో ఏ ప్రత్యేక పూజలు నిర్వహించింనా అందులో పాల్గోనేవారిలో అధికశాతం మండల దీక్ష చేసే భక్తులదే. ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా దర్శించి.. ఒక్కటి రెండు రోజులు స్థానికంగా బస చేసి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా వున్నా.. ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు, శాశ్వత పూజలు, బోగం ప్రసాదాల సమర్పణ అంతా చేసే భక్తులలో.. మండలదీక్ష చేపట్టిన భక్తులదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికే ఆలయ నిర్మాణంలో గుట్టపైన ఉండే వెసలుబాటు లేక ప్రతి రోజు కిందకు పైకి అటోలలో వెళ్తున్న మండలదీక్ష భక్తులు.. అనేక వ్యయాలకు ఓర్చాల్సివస్తోంది. ఇక తాజాగా పెంచిన ఆలయపూజలు, ప్రసాదాల టిక్కెట్ల ధరలతో వారు స్వామికి ఎలాంటి సేవ చేసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేకపోతున్నామంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆయురారోగ్యాలను ప్రసాదించమని కొందరు.. తమకు అరోగ్య సమస్యలను దూరం చేయాలని కోందరు స్వామివారిని నమ్మి.. ఆయనే వైద్యుడై తమ రోగాలను దూరం చేస్తాడని విశ్వసించి.. అచెంచలమైన భక్తితో గుట్టకు చేరుకుని అక్కడే 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు.
అయితే ఇక్కడ దీక్ష చేపడితే.. స్వాయంగా నరసింహస్వామి కలలో.. భక్తులకు తెలిసిన వారి రూపంలో సాక్ష్యాత్కరించి.. భక్తులతో పూజలను, బోగాలను సమర్పించుకునేలా అదేశిస్తారు. అయితే ఇలా తమకు దర్శనమిచ్చి స్వామి పూజలనో, బోగాలనో కావాలని అదేశిస్తే.. అందుకు తగ్గట్టుగా ఆర్థిక పరిస్థితి లేక తాము ఏం చేయాలని కొందరు భక్తులు అందోళన చెందుతున్నారు. మండల దీక్ష చేపట్టే భక్తులొక్కక్కరినీ ఒక్కో విధంగా స్వామి వారు పలానా పూజలు చేయాలని అదేశిస్తుంటారు. ఒక్కసారిగా దేవాలయ యాజమాన్యం ధరలను విపరీతంగా పెంచితే.. ఆ పూజలను చేయించడం తమకు కష్టంగా మారుతోందని భక్తులు అవేదన చెందుతున్నారు.
ఇక స్వామివారి కొండపై కొలువైన శ్రీ పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలోనూ విశేష పూజలను చేయించాలని స్వామివారు అదేశిస్తుంటారు. ఈ నేపథ్యంలో మండలదీక్ష చేస్తున్న భక్తులు యాదగిరి లక్ష్మీనరసింహా.. నీకు పూజలు నిర్వహించడం.. నీకు బోగాలను నివేదన చేయడం కూడా ఇక మాతకు ప్రియంగా మార్చేశావా.? అంటూ అవేదనభరితులు అవుతున్నారు. మరి దీనిపై యాదాద్రి దేవాలయ యాజమాన్యం పునరాలోచించాలని కూడా భక్తులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more