1.కడుపు నిండినవాడు ఆకలి యెరుగడని
అపజయములందే జయము కలదని
నివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందని
చిలికి చిలికితేగాని వెన్నరాదని
పలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//
2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచం
దు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదని
దు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే అది నశిస్తుందని
పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//
3. ఎవరికర్మలకు వారే కర్తలని
ఆలుమగలకర్మలు ఒకరివి మరొకరికి అంటవని
ప్రస్తుతకర్మ ఫలములు గతజన్మకర్మల కారణమేనని
పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//
4. పండుటాకు లాంటివి జీవితాలు
తెలియరాదుఎవరికి ఎప్పుడు రాలుతాయోననని
మాయతో కప్పబడిన జీవితాన్ని గుర్తించాలి
పరిశీలనా నెత్రాలతోనేనని
తొలగించాలి జ్జానమనే జ్యోతితోనేనని
పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//
5. చీకటి కనుమరుగవ్వాలంటే వెలుగు కావాలి
అజ్జానము పోవాలంటే ఆత్మ జ్జ్నానము రావాలి
ఆడంబరాలతో పొందే ఆనందం తాత్కాలికమని
సత్కర్మలతో పొందే ఆనందం శాస్వతమని
పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//
-రఘురాం పాటిబండ
(And get your daily news straight to your inbox)
Nov 02 | 1. భార్యా భర్తల బందం విడరాని రాని అనుబంధంమనసులు కలవాలి పాలు నీళ్ళులాసుఖ దుఃఖా లను పంచుకొవాలి ఆప్యాయంగాననిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. కాయశరీరం కాంతి శరీరంకొరివి శరీరం కరకు శరీరంకీర్తి శరీరం ఉత్తమ... Read more
Oct 27 | 1. నిర్జీవులను కాలుస్తుంది చితిసజీవులను దహిస్తుంది చింతకరిగి పోయే మంచు లాంటిది జీవితంఉన్నంతలో పంచాలి నలుగురికనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//***2. శాంతిలేని మనసుకు విశ్రాంతిలేదుఅత్యాసలవల్ల గతి తప్పు తుంది మనస్సుమితి మీరిన కొరికల వల్ల... Read more
Sep 20 | 1. సత్యము పలుకువాడు అసత్యమెరుగడనికడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే... Read more
Sep 12 | వెన్నెలవంటిచూపులు,వెన్నవంటిమనస్సువెలుగు లాంటి జీవితం,వేదన లేని ప్రవర్తనకోరుకుంటాడు ప్రతి జీవి , అదే పరమార్ధమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై// మనసులోని వేదన మమతకే తెలుసుననిప్రేమలోని అనురాగం ప్రేమించే వారికే తెలుసుననికడలిలోనిలోతు ఒక్కనీటికే తెలుసుననితల్లిప్రేమ మాతృమూర్తికే తెలుసుననే... Read more