Bharadawajasa Satakam poems written by Raghu Ram Patibanda

Bharadawajasa satakam poems written by raghu ram patibanda

Bharadawajasa, Satakam, poems, Raghu Ram Patibanda

Bharadawajasa Satakam poems

భారద్వాజస

Posted: 09/20/2016 10:50 AM IST
Bharadawajasa satakam poems written by raghu ram patibanda

1. సత్యము పలుకువాడు అసత్యమెరుగడని

కడుపు నిండినవాడు ఆకలి యెరుగడని

అపజయములందే జయము కలదని

నివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందని

చిలికి చిలికితేగాని వెన్నరాదని

పలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచం

దు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదని

దు:ఖం ఒక రోగం, జ్జానమనే మందుతోనే అది నశిస్తుందని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//

3. ఎవరికర్మలకు వారే కర్తలని

ఆలుమగలకర్మలు ఒకరివి మరొకరికి అంటవని

ప్రస్తుతకర్మ ఫలములు గతజన్మకర్మల కారణమేనని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//



4. పండుటాకు లాంటివి జీవితాలు

తెలియరాదుఎవరికి ఎప్పుడు రాలుతాయోననని

మాయతో కప్పబడిన జీవితాన్ని గుర్తించాలి

పరిశీలనా నెత్రాలతోనేనని

తొలగించాలి జ్జానమనే జ్యోతితోనేనని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//


5. చీకటి కనుమరుగవ్వాలంటే వెలుగు కావాలి

అజ్జానము పోవాలంటే ఆత్మ జ్జ్నానము రావాలి

ఆడంబరాలతో పొందే ఆనందం తాత్కాలికమని

సత్కర్మలతో పొందే ఆనందం శాస్వతమని

పలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//


                                                                       - రఘురాం పాటిబండ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Bharadawajasa  Satakam  poems  Raghu Ram Patibanda  

Other Articles

  • Bharadwaja satakam poems

    భారద్వాజస శతకం

    Nov 02 | 1. భార్యా భర్తల బందం విడరాని రాని అనుబంధంమనసులు కలవాలి పాలు నీళ్ళులాసుఖ దుఃఖా లను పంచుకొవాలి ఆప్యాయంగాననిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. కాయశరీరం కాంతి శరీరంకొరివి శరీరం కరకు శరీరంకీర్తి శరీరం ఉత్తమ... Read more

  • Bharadwajasa shatakam 4th phase

    భారద్వాజస శతకం

    Oct 27 | 1. నిర్జీవులను కాలుస్తుంది చితిసజీవులను దహిస్తుంది చింతకరిగి పోయే మంచు లాంటిది జీవితంఉన్నంతలో పంచాలి నలుగురికనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//***2. శాంతిలేని మనసుకు విశ్రాంతిలేదుఅత్యాసలవల్ల గతి తప్పు తుంది మనస్సుమితి మీరిన కొరికల వల్ల... Read more

  • Kadupu nindina vaadu aakali erugadu

    కడుపు నిండినవాడు ఆకలి యెరుగడని

    Oct 13 | 1.కడుపు నిండినవాడు ఆకలి యెరుగడనిఅపజయములందే జయము కలదనినివురు గప్పిన నిప్పు నుండే అగ్ని బహిర్గతమవుతుందనిచిలికి చిలికితేగాని వెన్నరాదనిపలుకు తున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//2. దు:ఖంలో నిమిడీక్రుతమైనదే ప్రపంచందు:ఖం ఎక్కడోలేదు నీలోనే నిర్లిప్తమైఉన్నదనిదు:ఖం ఒక రోగం,... Read more

  • Bharadwaja satakam poems

    భారద్వాజస శతకము

    Sep 12 | వెన్నెలవంటిచూపులు,వెన్నవంటిమనస్సువెలుగు లాంటి జీవితం,వేదన లేని ప్రవర్తనకోరుకుంటాడు ప్రతి జీవి , అదే పరమార్ధమనిపలుకుతున్నాడు రఘురాముడు భారద్వాజస గోత్రీకుడై//  మనసులోని వేదన మమతకే తెలుసుననిప్రేమలోని అనురాగం ప్రేమించే వారికే తెలుసుననికడలిలోనిలోతు ఒక్కనీటికే తెలుసుననితల్లిప్రేమ మాతృమూర్తికే తెలుసుననే... Read more