వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోటను కేవలం 9 నెలల్లోనే ఒక్క తెలుగోడి దెబ్బతో నేలమట్టం అయింది. ఢిల్లీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిన తెలుగు నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో ఇందిరా గాంధీ కంబంధ హస్తం క్రింత తెలుగు వారు నలిగిపోతున్న రోజులవి? తెలుగు వారికి స్వేచ్చ కోసం, తెలుగు వారి అభివ్రుద్ది కోసం, తెలుగు రైతుల కోసం, నిమ్మగడ్డ నట సింహ నడుం బిగించాడు. అప్పటి వరకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు లేవు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే పార్టీకి నందమూరి తారక రామారావు 9నెలల్లో తెలుగు వారి సత్తా ఏమిటో చూపించి, ఇందిరా గాంధీ కంటిలో నలుసుగా మారిపోయాడు. ఎప్పుడు ఓటమి చవిచూడాని ఇందిరా గాంధీకి ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోవటం ఇందిరా గాంధీకి మింగుడుపడలేదు. అప్పటి వరకు ఎన్నికైన ముఖ్యమంత్రుల అందరు ఢిల్లీ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకరం చేసేవారు. కానీ తెలుగు ప్రజల చేత ఎన్నుకొబడిన నాయకుడిగా, మొట్ట మొదటి సారి లాల్ బహుదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరం చేసి తెలుగు జాతి సత్తా ఏమిటో ఢిల్లీ నాయకులకు చూపించారు. అంతేకాకుండా లోక్ సభలో తెలుగు రాష్ట్రం నుండి 30 మంది ఎంపీలతో వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ప్రతిక్ష హోదో కూర్చున్న నాయకుడుగా ఎన్టీఆర్ ప్రపంచనికి తెలుగోడి గొప్పతనం ఏమిటో సాటి చెప్పాడు. 1983లో అధికారంలో ఎన్టీఆర్ రాష్ట్రంలోని అన్ని మతలను, కులలాను, ఒక తాటి పైకి తెచ్చి, తన విజయ బాటకు సోపనం వేసుకున్నారు. కుల, మత బేధాలు రాజకీయ పార్టీలో లేవు అని చెప్పి నాయకుడు ఎన్టీఆర్. ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఆ నిర్ణయం వలన పార్టీకి నష్టం వస్తుందని తెలిసిన, ఆయన తెలుగు ప్రజల వైపే మొగ్గు చూపుతారు. తెలంగాణలో పటేల్ వ్యవస్థు రద్దు చేసిన ఘనట ఎన్టీఆర్ దే. ఒకనోక సమయంలో ఈనాడు మొదటి పేజీలో రూ. 227 కోట్లు రాష్ట్రం లాస్ లో ఉందని ప్రకటించింది. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఎంతో రహస్యంగా ఉండవలసి రాష్ట్ర బడ్జెట్ విషయాలు బయటకు లీక్ అవ్వటంత ఆయన సహించలేకపోయారు. వెంటనే కేబినేట్ మొత్తం చేత రాజీనామాలు చేయించి, కొత్త కేబినేట్ ఏర్పాటు చేసిన కొత్త చరిత్ర స్రుష్టించారు.
దీంతో ఆయన పై అనేక విమర్శలు రావటం జరిగింది. అయిన ఆయన దేనికి భయపడకుండా ముందుకు సాగిపోయాడు. ఎన్టీఆర్ ప్రజా నాయకుడుగా ఎదగటానికి కారణం, తెలుగు వారికి కూడు...గుడ్డ.. ఇల్లు ప్రతి పేదవాడికి అందించారు. ముఖ్యంగా రైతుల పాలిట దేవుడు. అన్నదాతకు వెన్నుగా నిలిసిన నాయకుడు నందమూరి తారక రామారావు ఒక్కరే. రైతాన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి. ఒక సంవత్సరానికి రైతులకు కరెంట్ ఛార్జీ కేవలం 50 చెల్లించే విధంగా ఆలోచన చేసిన నాయకుడు ఎన్టీఆర్. 1984 లో అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ మరణం. దేశం ప్రజలపై ఆమె ప్రభావం బాగా చూపాయి. 1983 నుండి చక్రం తిప్పిన ఎన్టీఆర్ కు 1989లో బ్రేక్ పడింది. 1989 లో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వానికి బిన్నద్రువాల లైప్ట్- రైట్ లు ఒకేసారి మద్దతు ఇవ్వటంలో ఎన్టీఆర్ ఆవిరల క్రుషి చేశారు. నేషషల్ ఫ్రంట్ చైర్మన్ గా వి.పి. సింగ్ సపోర్టు చేశారు. 1994లో ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మధ్యపాన నిషేదంపై తొలి సంతకం చేశారు. మధ్యపాన నిషేదం తెలుగులోగిళ్ళలో నిజమైన సంక్రాంతి తెచ్చిందని చెప్పవచ్చు. మాట ఇస్తే దానిని నేరవేర్చేందుకు ఎన్టీఆర్ తహతహలాడేవారు. రాష్ట్రం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1994 ఎన్నికల్లో 26 సీట్లకు దిగజారిన కాంగ్రెస్ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. 1994-1995ల మద్య ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో చోటుచేసుకున్న పలు వివాదాస్పద అంశాలను పక్కన పెడితే తెలుగువారికి విశ్వవ్యాప్త కీర్తి వచ్చేందుకు కారకుడు ఎన్టీఆర్. ఈ మధ్యలో తన చిరకాల స్వప్నం సామ్రాట్ అశోక్ చిత్ర నిర్మాణం జరిగింది. ఆయన చిట్టచివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ లో నటించారు. మూడు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్తానంలో అనేక మిట్లపల్లాలు చవిచూసిన తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి నాలుగు రోడ్ల మద్యలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more