Veturi sundararama murthy jayanthi

veturi-sundararama-murthy, veturi , 29 jan, telugu lyric writer, sundararama murthy, birthday, tollywood best songs writer veturi veturi sundararama murthy jayanthi,date

Veturi Sundararama Murthy Jayanthi

పదశిల్పి వేటూరి

Posted: 01/31/2013 12:00 PM IST
Veturi sundararama murthy jayanthi

Veturi Sundararama Murthy Jayanthi

పది నిమిషాల్లో పాట రాసేసి పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీకవి వేటూరి సుందరరామ్మూర్తి. రోజు  వేటూరి జయంతి. వేటూరి సుందరరామ్మూర్తి జననం: 29 జనవరి 1936 మరణం : 22 మే 2010. ఆత్త్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరి. వేటూరి సుందరరామ్మూర్తి 1936జనవరి 29కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు.. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు.  ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబడతాయి. జనపదాల సొయగాలు హొయలు పోతాయి. నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి. సాంప్రదాయ సంగీత కీర్తనలు, సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని "శంకరాభరణం" లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు. ఆయన రాసిన పాటల్లో  పిల్లన గ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే పుత్తడిబొమ్మా కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఆయన అన్నివయసుల్లోనూ బహుముఖీన శైలుల్లో పాటలు రాశారు. తకిట తథిమి, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, దుర్యోధన దుశ్శాసన, నిన్నటిదాకా శిలనైనా, ఆమనీ పాడవే, చినుకులా రాలి, శుభలేఖ రాసుకున్నా, నీమీద నాకు యిదమ్మో, అందంగా లేనా అసలేం బాలేనా వంటి భిన్నభావాలను పలికించారు.రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు పొందిన జాతీయ అవార్డును తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వడం లేదని వెనక్కివ్వబోయిన భాషాభిమానం ఆయనది. వేటూరి పయనం పాత్రికేయం నుంచి ‘పాట’కీయం వరకు సాగింది. పాటకు లేని మరణం ఆయన కీర్తికి ఉంటుందా?

తెలుగు పాటకు ఆయన చిరునామా

తెలుగు పాటే ఆయనకు చిరునామా

 సంస్కృత భూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి

సమోసాలాంటి పాటగా మార్చి అందించినా

 లలిత శృంగార భావాలను మనోహరంగా పేర్చి

అందమైన పాటగా మలిచి అలరించినా

 మొరటు పదాల జానపద పలుకులను నేర్పుగా అల్లి

మసాలా కూర్చి సగటు ప్రేక్షకుడ్ని మెప్పించినా

 జీ్వితంలోని బాధల్ని, విషాదాల్ని గాయకుల స్వరాల్లో నింపి

రాలిపోయే పువ్వుల్ని వర్ణించి ప్రేక్షక శ్రోతల గుండెలు పిండి ఏడిపించినా

 అది వేటూరికే చెల్లింది.

ఆయన పుట్టుకే కవి

 కెరీర్ ప్రారంభం నుంచి తుది శ్వాస విడిచే వరకు ఆయన రాసిన పాటల్లో మాస్ సాంగ్స్ ఉన్నాయి,క్లాస్ సాంగ్స్ ఉన్నాయి.  సాహిత్య విలువలు ఉన్న పాటలతో పండితులను రంజింపచేశారు వేటూరి. వేటూరి తరాన్నే కాదు తరాన్నీ ఉర్రూతలూగించారు. ఒకప్పుడు ఆయన పాటలేని సినిమా లేదేమో.  భాష మీద పట్టు తో పాటు, స్వరజ్ఞానం ఆయనకున్న వరం. శబ్దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సినిమా పాటని రక్తి కట్టించారు  ఆయన. ఇళయరాజా, వేటూరి కలిసి తెలుగు శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే ఎన్నో పాటల్ని  అందించారు. వేటూరి సుందరామ్మూర్తి  పద్నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారు . తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తనకు  వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమాని  వేటూరి. తెలుగు పాటను లాలించి పాలించి శాసించిన వేటూరి మన మధ్య లేకపోయినా ఆయన పాటలు  తెలుగు శ్రోతల హృదయాల్లో మోగుతూనే ఉంటాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles