Telugu desam nandamuri taraka rama rao 90th jayanthi

nandamuri taraka ramarao, legendary telugu actor and politician ntr, senior ntr 90th jayanthi photos, sr ntr 90th jayanthi, ntr 90th jayanthi photos, nandamuri taraka rama rao 90th jayanthi photos, ntr 90th birthday celebrations photos, ntr 90th jayanthi pics, n krishna district on 28th may, ntr family, chandrababu naidu, junior ntr family,

nandamuri taraka rama rao 90th Jayanthi

ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 90 వ జయంతి.

Posted: 05/28/2013 03:15 PM IST
Telugu desam nandamuri taraka rama rao 90th jayanthi

ఇంట్లో - రాముడైనా ,కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా వెండి తెర దేవుడిగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు నందమూరి తారక రామారావు. నిజమైన దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో భక్తా అంటే, నువ్వు దేవుడేంటి... మా ఎన్టీవోడు లాగా లేవే అనే స్ధాయిలో ప్రజల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న తెరవేల్పు.. ఎన్టీఆర్. నీ పుట్టుక మాకొక వరం... నీ మాట ఒక ప్రభంజనం .... నువ్వు వేసిన ప్రతి అడుగు మాకు మార్గదర్శకం ....తెలుగువాడి ఆత్మగౌరవం నువ్వు ....పేదవాడి గుండెచప్పుడు నువ్వు ...తెలుగు కళామతల్లి ముదుబిడ్డవి నువ్వు ...రాజకీయ వినీలాకసంలో మెరిసిన ఓ తెలుగు తేజమ నీకు ఇదే మా జోహారులు. అంతేకాకుండా కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఎన్.టి.ఆర్. మే 28 వెండి తెర దేవుడు ఎన్.టి. ఆర్ జయంతి. ఈ సందర్భంగా ఆ విశ్వ విఖ్యాత నట సార్వభౌమునికి ప్రత్యేకమైన అంజలి ఘటిస్తూంది తెలుగు విశేష్.


నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్‌ పుట్టి.. నేటికి సరిగ్గా 90 ఏళ్లు. తెలుగుజాతి ఉనికి ఉన్నంతకాలం.. ఆయన పేరు నిలిచే ఉంటుంది.కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో మే 28, 1923 న ఎన్టీఆర్‌ జన్మించారు. విజయవాడ మున్సిపల్‌ హైస్కూల్లో పాఠశాల విద్య.. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో కాలేజీ చదువు పూర్తిచేశారు. కొన్నాళ్లు మంగళగిరిలో సబ్‌ రిజిస్టార్‌గా ఉద్యోగం చేశారు. అయితే, అప్పటికే మంచి రంగస్థల నటుడిగా పేరుగాంచిన రామారావు.. ఉద్యోగంలో కుదురుకోలేక పోయారు. సినిమాలపై ఆసక్తితో.. మద్రాసు చేరారు.

ముప్పై మూడేళ్ల పాటు తెలుగు తెరను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు.. ఎన్టీఆర్‌... అప్పటి దాకా కళామతల్లి సేవలో తరించిన రామారావు.. ప్రజాసేవ చేయాలని సంకల్పించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. చైతన్యరథంపై తెలుగునేలను చుట్టేసి.. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్‌ను మట్టికరిపించి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి ఆ పదవికే వన్నె తెచ్చారు. 2 రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం, మధ్యాహ్న భోజన పథకంతో పాటు అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందించి.. పేదల పక్షాన నిలిచారు.

అయితే, కొన్ని రాజకీయ కారణాలతో మధ్యలో పదవి కోల్పోయినా.. ప్రజల అభిమానంతో తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనిమిదేళ్ల పాటు సీఎంగా ఉండి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రామన్న 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. 1996లో అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగుజాతి చరిత్రలో ధృవతారగా నిలిచిపోయారు.


 

నటుడి గా ఆయన గొప్పతనం తెలియడానికి ఒక్క "దాన వీర శూర కర్ణ" సినిమా చాలు.

మనకు తెలిసిన, తెలియని ఎన్నో పౌరాణికాలను, చరిత్ర ను సినిమాల రూపంలో, CD DVD ల రూపంలో భావితరాలవారికి అన్న గారు అందించినట్టయ్యింది

ఇందిరాగాంధీ చనిపోయి దేశమంతా సానుభూతి పవనాలు వీస్తున్న సమయం లో రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మట్టి కరిపించడం ద్వారా దేశనాయకుల కన్నా మా నాయకుడి మీదే మాకు ప్రేమ ఎక్కువ అని తెలుగు వారు చెప్పటం NTR సమ్మోహన శక్తి కి నిదర్శనం.

తెలుగు వారికి ఆరాధదైవంగా మారిన అన్నగారు .. రాముడు అనే పేరుతో కొన్ని సినిమాల్లో నటించి తెలుగు వారికి మనసుల్లో రాముడుగా మిగిలిపోయారు..

"రాముడు" పేరు తో అన్నగారు నటించిన చిత్రాలు.

అగ్గి రాముడు (1954)

శభాష్ రాముడు (1951)

బండ రాముడు (1959)

టాక్సీ రాముడు (1961)

టైగర్ రాముడు (1962)

పిడుగు రాముడు (1966)

అడవి రాముడు (1977)

డ్రైవర్ రాముడు (1979)

శ్రుంగార రాముడు (1979)

ఛాలెంజ్ రాముడు (1980)

సర్కస్ రాముడు (1980)

సరదా రాముడు (1980)

కలియుగ రాముడు (1982)

అన్న గారి చిత్రాలలో మరికొన్ని "రాము"లు

రాముడు భీముడు (1964)

రాము (1968)

భక్త రామదాసు (1969)

రాముని మించిన రాముడు (1975)

శ్రీరామ పట్టాభిషేకం (1978)

రామ క్రుష్ణులు (1978)

రౌడీ రాముడు కొంటె క్రుష్ణుడు (1980)

అన్నగారు పేరులో మొదటి ‘రా ’ అక్షరం మీద తీసి సినిమాలు. అందుకే అన్నగారు తెలుగు వారికి రాముడుగా మిగిలిపోయారు. ఇలాంటి రామయ్యలు ప్రజా సేవా కోసమే పుట్టి, చిరస్థాయిలోగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles