బ్రిటీష్ వారి పరిపాలనాకాలంలో పేదవారి దుస్థితి ఎలా వుండేదో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా కూలీల పరిస్థితి అయితే మరీ దారుణంగా వుండేది. వారితో నిత్యం పనులు చేయించుకోవడమే కాకుండా, పన్నులు కూడా కట్టించుకునేవారు. కూలీలమీద వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు! దీంతో ఆగ్రహానికి గురైన కొంతమంది విప్లవకారులు.. కూలీల మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ముందుకు వచ్చారు. తమదైన శైలిలో కొంతమంది ఉద్యమాలు, నిరసనలు చేశారు. అటువంటివారిలో ఉన్నల లక్ష్మీనారాయణ కూడా ఒకరు. ఈయన కేవలం కూలీలకోసం మాత్రమే కాదు... దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన స్వాతంత్ర్య సమరయోధుడు... గాంధీసూత్రాలను పాటించిన గాంధేయవాది, సంఘసంస్కర్త, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడిగా విశేషమైన కీర్తి సాధించిన ఒక ప్రముఖ న్యాయవాది.
వ్యక్తిగత జీవితం :
గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు ఉన్నవ లక్ష్మీనారాయణ జన్మించారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆయన.. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివారు. అయితే ఆనాడు బాల్యవివాహాలు ప్రబలంగా వున్న నేపథ్యంలో 1892లోనే లక్ష్మీబాయమ్మతో ఈయనకు వివాహం జరిగింది. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందారు. 1916లో బర్లాండ్, డబ్లిన్ లలో బారిష్టర్ చదువు సాధించారు.
లక్ష్మీనారాయణ 1900లో గుంటూరు లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించారు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1917లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1923లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరారు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శులు ఇద్దరిలో ఒకడుగా ఎన్నికయ్యారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.
ఇతర విశేషాలు :
1917న రష్యాలో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి, వారి పక్షం వహించి, వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వ్యక్తి. సాంఘిక , ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు. అందుకు నిరూపణగా ‘‘మాలపల్లి’’ అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత ‘‘సంగ విజయం’’ అనే పేరు కూడా పెట్టాడు. అయితే 1922లో ఈ ‘‘మాలపల్లి’’ నవలకు బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ముద్రించగా.. దానిపై మద్రాసు ప్రభుత్వం నిధేషం విధించింది. ఈ విషయంపై చర్చలు జరిగిన అనంతరం 1928లో కొన్ని మార్పులతో తిరిగి ప్రచురణకు అనుమతి లభించింది. కానీ మళ్లీ 1936లో మద్రాసు ప్రభుత్వం నవలపై రెండోసారి నిషేధం తెలిపి, పాఠ్యగ్రంథంగా తొలగించింది. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వులను రద్దు చేసింది.
సాంఘిక సేవ :
ఈయన ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో గుంటూరు లో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్, 1902 లో వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. అలాగే వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని 1912 లోను సందర్శించారు. 1913 లో జొన్నవిత్తుల గురునాథం తో కలసి విశాలాంధ్ర పటం, 1922 లో శారదానికేతన్ ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించారు. ఈయన సాగించిన అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో, స్వాతంత్ర్య ఉద్యమాల్లో ఆయనకు చేదోడు-వాదోడుగా, సహధర్మచారిణిగా అతని భార్య లక్ష్మీబాయమ్మ విశేష సేవలనందజేశారు కూడా! ఇలా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ సాహిత్య వైతాళికుడిగా కీర్తి పొందిన ఉన్నవ.. 1958 సెప్టెంబరు 25 న తుది శ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more