Kanyasulkam gurajada apparao biography

gurajada apparao news, gurajada apparao books, gurajada apparao writings, gurajada apparao biography, gurajada apparao kanyasulkam, gurajada apparao birthday special, gurajada apparao history, gurajada apparao stories, gurajada apparao life history, gurajada apparao life story, gurajada apparao wife

gurajada apparao biography who wrotes kanyasuklam drama which is famous worldwide

కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శించిన హేతువాది!

Posted: 09/22/2014 03:29 PM IST
Kanyasulkam gurajada apparao biography

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరు. తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన తెలుగు భాష మహాకవి. ఈయన గురించి తెలియనివారు వుంటారేమోగానీ.. ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం, అందులో సృజించిన ‘‘తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి.. డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది.. పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌’’ తదితర వాక్యాల గురించి విననితెలుగువారు ఎవ్వరుండరు. అలాగే ఆయన ఆ నాటకంలో సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు వంటి పాత్రలు కూడా ఇప్పటికీ ప్రఖ్యాతి పొందాయి. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ.. చేతకానితనంగానూ భావించే ఆరోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలా జీవభాషలో రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలో వాడుకభాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యులైన ఈయన.. ‘‘అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర’’ వంటి బిరుదులను పొందారు.

జీవిత చరిత్ర :

వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ దంపతులకు విశాఖ జిల్లాలోని ఎలమంచిలిలో వుండే ఆయన మేనమామ ఇంట్లో సెప్టెంబర్ 21, 1862లో జన్మించారు. ఈయనకు శ్యామలరావు అనే తమ్ముడు వున్నారు. గురజాడ 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, తర్వాత 1884లో ఎఫ్.ఏ. చేశారు. ఆ సంవత్సరంలోనే ఆయన ఎం.ఆర్.హైస్కూలులో టీచర్ గా పనిచేశారు. అనంతరం 1885లో అప్పల నరసమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం... ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

విజయనగరంలో తన కుటుంబంతో నివాసం ఏర్పరుచుకున్న ఈయన.. 1887లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మొదటగా ప్రసంగించారు. ఆ సమయంలోనే సాంఘిక సేవకోసం ‘‘విశాఖ వలంటరీ సర్వీసు’’లో చేరారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు వైస్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామల రావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసారు. వీరు రాసిన ఆంగ్ల పద్యం "సారంగధర" "ఇండియన్ లీషర్ అవర్"లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న "రీస్ అండ్ రోయిట్" ప్రచురణకర్త శ్రీ శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావు గారిని తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రపంచప్రఖ్యాతి గాంచిన ‘‘కన్యాశుల్కం’’ నాటకాన్ని రచించారు. ఆరోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచాలపై విమర్శగా ఈ నాటకాన్ని ఆయన రచించారు. 1892లో నాటకప్పు తొలిప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు. 1909లో ఆరోగ్యం కుదుటపడిన సమయంలో నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ‘‘కన్యాశుల్కం’’ తిరిగి రాశారు. 1910లో ‘‘దేశమును ప్రేమించమన్నా’’ అనే గీతాన్ని రాశారు. ఇది పేరు పొందింది కూడా! 1911లో మద్రాస్ విశ్వవిద్యాలయానికి ‘‘బోర్డు ఆఫ్ స్టడీస్’’గా నియమించబడ్డారు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 1913లో పదవీ విరమణ చేశారు. అప్పుడు ఆ విద్యాలయం ఆయన్ను ‘‘ఫెలో’’తో గౌరవించింది. చివరికి 1915 నవంబర్ 30న 53 సంవత్సరాల వయస్సులో గురజాడ మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gurajada apparao  telugu writers  gurajada apparao biography  kanyasulkam  

Other Articles