ప్రపంచ చరిత్రలో ఎక్కడాలేని విధంగా భారతదేశంలో ఎందరో తెలుగు మహా కవులు వున్నారు. కొందరు తమ రచయితల ద్వారా దేశగౌరవాన్ని పెంపొందించడంలో ప్రధానపాత్ర పోషిస్తే.. మరికొంతమంది కుల-మత-జాతి-భేదాలకంటే ఏకత్వమే మహోన్నతమైందంటూ సందేశాలు అందజేసిన వారున్నారు. మరికొంతమంది తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఉట్టిపడేలా, ప్రజల్లో చైతన్యం పెరిగేలా రచనలు రాసిన వాళ్లు వున్నారు. ఇలా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరకంగా ఖ్యాతి గడించిన ఎందరో మహాకవులు ఎందరో జన్మించారు. అటువంటివారిలో పింగళి లక్ష్మీకాంతం ఒకరు.
పింగళి లక్ష్మీకాంతం... ఈయన అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవారు. పింగళి కాటూరి జంటకవుల్లలో పింగళి అయిన ఈయన.. తెలుగులో ప్రసిద్ధ కవిగా ఒక ప్రత్యేక ముద్రను పదిలపరచుకున్నారు. ఈయన కేవలం కవి మాత్రమే కాదు.. ఒక అధ్యాపకుడిగా, నటుడిగా, ఇంకా ఇతర రంగాల్లోనూ అనూహ్యంగా తన ప్రతిభను కనబరిచిన బహుముఖ ప్రజ్ఞశాలి. అంతేకాదు.. ఈయన అనేక రంగాల్లోనూ కీలకపాత్రలు పోషించారు. ఒక పరిశోధకుడిగానూ పనిచేసిన ఈ కవి.. ఎన్నో రచనలు రచించారు. వివిధ సంస్థల్లో విధులు నిర్వహించారు.
జీవిత చరిత్ర :
బాల్యం విద్యాబ్యాసం : 1894 జనవరి 10 న కృష్ణా జిల్లా ఆర్తమూరులో వెంకటరత్నం, కుటుంబమ్మ దంపతులకు పింగళి లక్ష్మీకాంతం జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పూర్తిచేసిన తరువాత ఉన్నత విద్యకోసం మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.
వృత్తిపరంగా : ఈయన నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోను, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను ఆంధ్రాచార్యులుగా అధ్యక్షులుగా పనిచేసారు. బందరు నోబుల్ హైస్కూలులో తెలుగు పండితుడిగా,
మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడిగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడిగా విధులు నిర్వహించారు. ఇంతేకాదు.. ఇంకా రకరకాల విశ్వవిద్యాలయాల్లో విభిన్న హోదాల్లో సేవలు అందించారు.
నటనాపరంగా : కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి ఈయన ఆంజనేయస్వామిపై ఒక శతకం చెప్పారు. వీరిద్దరు జంటకవులుగా ముదునురు, తోట్లవల్లూరు, నెల్లూరు మొదలైన చోట్ల శతావధానాలు చేశారు. వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.
రచనాపరంగా : తెలుగు సాహిత్యరంగంలో ప్రసిద్ధకవిగా పేరుగాంచిన ఈయన ఎన్నో రచనలు చేశారు. తెలుగుజాతి వారి గురించి, సంస్కృతం, పాండిత్యం.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక రచనలు రచించారు. తనకంటూ కవిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈయన.. 1972 సంవత్సరం జనవరి 10 తేదీన పరమపదించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more