తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా భావించే మూవీ మొఘల్ డి.రామానాయుడు.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి ఎదిగారు. ఎన్నో అవకతవకలను చవిచూసి, కష్టాలను ఎదుర్కుని, కొత్త నటీనటులను అవకాశం కల్పించిన ఈయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన.. పట్టుదల వుంటే దేన్నైనా సాధించగలని చేసి నిరూపించుకున్నారు. కేవలం నిర్మాతగాగానే కాదు.. భారత పార్లమెంటు మాజీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సమాజంలో మంచి కార్యక్రమాలను చేపట్టాలనే థృక్పదంతో ముందుకు నడిచిన ఈయన.. తనకు చేతనైంతవరకు సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
జీవిత చరిత్ర :
1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయనకు మూడేళ్ల వయస్సు వున్నప్పుడే తల్లి చనిపోయారు. దీంతో ఆయన తన పినతల్లి దగ్గర ఎంతో గారాబంగానే పెరిగారు. ఒంగోలులోని తన బంధువు అయిన డాక్టర్ బిబిఎల్ సూర్యనారాయణగారి ఇంట్లో వుంటూ ఎస్సెస్సెల్సి దాకా విద్యాభ్యాసం చేశారు. ఈయన పెళ్లి తన సొంత మామా కూతురయిన రాజేశ్వరితో వివాహం జరిగింది. తరువాత తండ్రి పంచిన ఆస్తిలో భాగంగా వందెకరాల పొలంతో సొంతంగా సేద్యం మొదలుపెట్టారు. అయితే.. సినిమాల మీద ఎక్కువ ఆసక్తి వుండేది.
ఓసారి ఈయన జన్మించిన ప్రాంతంలోనే ‘‘నమ్మిన బంటు’’ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సందర్భంగా ఎడ్లపందెం దృశ్య చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయన ఒక సీన్ లో నటించారు. ఎంతో హుషారుగా ఆ సీన్ లో నటించడం వల్ల అక్కడున్న సినిమావాళ్లంతా దృష్టి ఈయనపై పడింది. అయితే.. షూటింగ్ ముగిసిన తర్వాత ఈయన తిరిగి వెళ్తుండగా అక్కడే వున్న అక్కినేని.. ‘‘మీరు సినిమాలోకి ఎందుకు రాకూడదు?’’ అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానంగా ఆయన.. ‘‘నాకు నా ఇల్లు, వ్యవసాయం తప్ప మరే ఆలోచన లేదు’’ అని చెప్పారు.
కొన్నాళ్ల తర్వాత తన అల్లుడితో కలిసి నిత్యం ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్లేవారు. అక్కడే ఆయన సినిమావాళ్లతో పరిచయాలు ఎక్కువయ్యాయి. కొందరు చిత్రనిర్మాతలు తమకు భాగస్వాములు కావాలని రామానాయుడుగారికి కబురు పంపగా.. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇలా ఈ విధంగా ఆయన తనకు తెలీకుండానే ఇండస్ట్రీలోకి వచ్చేశారు. మొదట సహనిర్మాతగా సినిమాలు చేసిన ఈయన.. ‘‘రాముడు-భీముడు’’ చిత్రంతో పూర్తి నిర్మాతగా మారారు. ఈ చిత్రంకోసం తన దగ్గరున్న ఆస్తిని, ఇంటిని అమ్మేసి మరీ నిర్మించారాయన! ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనసాగింది.
‘ప్రేమ్ నగర్’ చిత్రం తీసేటప్పుడు కూడా పరిస్థితి ఘోరంగా వుండేది. తన దగ్గర ఆస్తులు లేకపోయినా.. ఇతరుల నుంచి డబ్బులను సర్దుబాటు చేసి అధిక బడ్జెట్ తో ఆ చిత్రాన్ని నిర్మించారు. అలా మొండిధైర్యంతో ముందడుగు వేసిన ఆయన.. మళ్లీ వెనక్కు తిరగలేదు. ఆయన సినీప్రస్థానాన్ని మలుపు తిప్పడంలో ప్రేమ్ నగర్ ఒక సూపర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఆయన 15 భాషల్లో 155కు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. మూవీ మొఘల్ గా గొప్ప పేరు సాధించారు. అంతేకాదు.. ఈయనకు ‘పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ వంటి పురస్కారాలు కూడా అందాయి.
ఇంతటి గొప్ప ప్రస్థానం కలిగిన ఈయన.. గతకొంతకాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఈయనకు ఎన్నోరకాల మందులు, వివిధ రకాల చికిత్సలు అందించారు. నటుడు, డాక్టర్ అయిన రాజశేఖర్ దాదాపు మూడునెలల వరకు చికిత్స అందించారు. కానీ.. ఫలితం లేకపోయింది. బుధవారం (18-02-2015) మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఆకస్మిక మృతిపై టాలీవుడ్ తోపాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం (19-02-2015) మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామానాయుడు స్టూడియోస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more