ప్రపంచంలో ఇంకా విజ్ఞానపరిజ్ఞానం అంతగా లేని సమయంలో విమానప్రయాణం చేయడం అంటేనే ఒక పెద్ద సాహసం చేసినట్లుగా కొందరు భావించేవారు. గాలిలో ప్రయాణం కాబట్టి.. ఏమవుతుందోనన్న భయాందోళనతో చాలామంది అసలా ప్రయాణం చేసేవారు కాదు. అటువంటి రోజుల్లో ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు యూరీ గగారిన్!
1961 ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించిన ఈ వ్యోమగామి.. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. అంతేకాదు.. ఇతను మొదటి సోవియట్ కూడా! ఇలా అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు ఇతనికి ప్రపంచంలోని అనేక దేశాలు రకరకాల పతకాలు, బహుమానాలు ఇచ్చి గౌరవించాయి. రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు.
జీవిత చరిత్ర :
1934 మార్చి 9వ తేదీన రష్యా దేశంలోని క్లుషినో ప్రాంతంలో జన్మించాడు. బాల్యం నుంచే చాలా చురుకుగా వుండే గగారిన్.. చదువులో మంచి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల, కళాశాలలో అందరి స్టూడెంట్స్ కంటే ఇతను అన్ని రంగాల్లోనూ ముందుండేవాడు.
అంతరిక్ష యాత్ర :
1961 ఏప్రిల్ 12వ తేదీన గగారిన్ అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రకెక్కాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టోక్ 3KA-2 (వోస్టోక్ 1). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్'. తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు.
ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.
మరణం :
గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి స్టార్ సిటీ లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్ గా తిరిగీ అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, చకలోవ్స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా.. ఇతను, ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మిగ్ -15UTI విమానం కిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి మరణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more