రాంషా.. పేరుమోసిన ఒక గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన తన కథలు, నవలలు, నాటకాలు, కవితలు, విమర్శలు తదితర కళల ద్వారా ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థిదశలోనే సాహిత్యరంగంలో ప్రవేశించిన ఈయన.. అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. 24 ఏళ్లు పూర్తిగా నిండేలోపే ఇతడి కలం ద్వారా వెలువడిన రచనలు ఈయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి.
జీవిత చరిత్ర :
1924 జూలై 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో నివాసముండే వేంకటరత్నం, దర్భా వేంకటరమణయ్య దంపతులకు రాంషా జన్మించారు. ఈయన అసలు పేరు వేంకటరామశాస్త్రి! రాంషా పుట్టింది ధనిక కుటుంబంలోనే అయినప్పటికీ.. తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల ఇతడి విద్యాభ్యాసం, మధ్య వయస్సు జీవితం పేదరికంలోనూ, సమస్యల ముళ్ళబాటలోనూ గడిచింది. ఈయన లేతవయసులో వుండగానే తల్లి మరణించగా.. పెదతల్లి పెంపకంలో అనాదరణ అనుభవించాల్సి వచ్చింది. దాంతో చిన్నవయసులోనే గ్రంధ పఠనాన్ని ఆశ్రయించడం జరిగింది.
ఇక ఈయన విద్యాభ్యాసం.. స్కూలు ఫైనల్ వరకూ సామర్లకోటలోనూ, కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఎఫ్.ఎ. చదివారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఈయన ‘శిలాప్రతిమ’ అనే నాటిక రచించి రజత పతకం బహుమతి పొందారు. ఆనాడు ఈయనలో దాగి వున్న ప్రతిభని నిడుదవోలు వేంకటరావు గుర్తించి.. ఇతడికి “విఙ్ఞానానికి పరాకాష్ఠగా విలసిల్లాలని” ‘రాంషా’ (రామ్ శాహ్) అని పేరు పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఈయన కొన్ని తరాలపాటు రాంషాగా ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు. 1948లో శిరీషతో ఈయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు స౦తాన౦.
జీవిత విశేషాలు :
రాంషా కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈయనకు కళాశాల విద్యార్థి నాయకుడూ, యువకవీ అయిన శ్రీ సోమసుందర్ తో పరిచయం ఏర్పడింది. ఆనాటినుంచే వారిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. అలా స్నేహితులుగా మారిన వీళ్లిద్దరు కలిసి 1944 నుంచి 1955 వరకు కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. అప్పట్లో ‘మార్క్స్’ రచనలు ఇతడిని బాగా ప్రభావితం చేశాయి. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థల గురించి మార్క్స్ వ్యాఖ్యానిస్తూ అప్పటికి వ్యాప్తంలో ఉన్న బ్రాహ్మణ ఆర్థిక వ్యవస్థ ఔన్నత్యాన్ని పదే పదే చెబుతూ ఉండేవాడు. అయితే.. కాలక్రమంలో సంసార బాధ్యతల వల్ల సంపాదనావసరాలు పెరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డాడు. దీంతో కమ్యూనిష్టు ఉద్యమంలోంచి విరమించుకున్నాడు.
మొదట చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపిన ఈయన.. 1957లో జీవనోపాధికై ‘ధర్మచక్ర పవర్ ప్రెస్’ను స్థాపించడం జరిగింది. కానీ.. ఆ ప్రెస్ కి అచ్చు వేయించుకున్నవారు మళ్లీ వచ్చేవారు కాదట. దాంతో తనే పుస్తకాలు వ్రాసి తనే అచ్చువేసుకుని అమ్ముకోవటం మొదలు పెట్టారు. 1960లో ధనికొండ హనుమంతరావు తన అభిసారిక పత్రిక నిర్వహణను చేపట్టమని రాంషాకు సూచించటం జరిగింది. ఆనాటి నుంచీ ఈయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 30 ఏళ్ళపాటు ఈ పత్రికను నడుపుతూ ఉన్నత స్థాయికి తీసుకువచ్చారు.
1990, ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రిలో ఏటేటా జరిగే పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవాన్ని తిలకించేందుకు, తన కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆర్.టి.సి. బస్సు ఢీకొనడంతో, కవి మిత్రుడు గోదావరిశర్మతో సహా రాంషా దుర్మరణం పాలయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more