రసాయన శాస్త్రంలో అవపోసన పట్టిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్ ఒకరు. సోవియట్ యూనియన్ కు చెందిన ఈయన... మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించి చరిత్ర సృష్టించాడు.
జీవిత చరిత్ర :
1834 ఫిబ్రవరి 8న రష్యాలో ‘వెర్నీ అరెంజ్యాని’ అనే గ్రామంలో మెండలీఫ్ జన్మించారు. బాల్యంలో విద్యాభ్యాసంలో ఎంతో చురుకుగా వుండే ఈయన.. ముఖ్యంగా రసాయన శాస్త్రంపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఆ క్రమంలోనే ఈయన అధ్యాపక వృత్తిని స్వీకరించిన అనంతరం ఎన్నో పరిశోధనలు చేశారు. రసాయన శాస్త్రంలో తనకున్న ప్రతిభను ప్రదర్శించి.. శాస్త్రజ్ఞునిగా తనయంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా రసాయనిక మూలకాలపై పరిశోధనలు చేసిన ఈయన.. వాటికి సంబంధించి పిరియాడిక్ టేబుల్ ఆవిష్కరించి చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన ప్రతిభకుగాను ఎన్నో సత్కారాలు, పురస్కారాలు లభించాయి.
రసాయన శాస్త్రంలో మెండలీఫ్ పరిశోధనలు :
మెండలీఫ్ టీచర్‌గా ఉన్న సమయంలో ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ కెమిస్ట్రీ’ (1868-1870) అనే రెండు భాగాల పాఠ్యపుస్తకాన్ని వ్రాశారు. అందులో మూలకాలను వాటి రసాయన గుణాల క్రమంలో వర్గీకరించడానికి ప్రయత్నించారు. అలా చేసే సమయంలో అతనికి కొన్ని సంఖ్యల తరువాత అవే రసాయన గుణాలు ఆ మూలకాలలో పునరావృతమవుతున్నాయని గమనించారు. అదే ఆయనకు ఆవర్తన పట్టిక తయారు చేసేందుకు నాంది పలికింది. అదే విధమైన లక్షణాలున్న మూలకాలను పట్టికలో చేరుస్తూ ఈయన ఒక ఆవర్తన పట్టిక తయారు చేశారు.
మార్చి 6, 1869న మెండలీఫ్ రష్యన్ కెమికల్ సొసైటీలో ఒక ఉపన్యాసాన్ని సమర్పించారు. ఈ ఉపన్యాసంలో భాగంగానే ఆయన మూలకాల గురించి వివరిస్తూ.. అవి ద్రవ్యరాశి, ఋణత్వం అనే గుణాలలో ఒక క్రమపద్ధతిని ప్రదర్శిస్తున్నాయని చర్చించారు. చివరికి ఆయన ఒక మూలకం లక్షణాలను బట్టి, దానికి ముందు వెనుక ఉన్న మూలకాల పరమాణు భారాలను బట్టి, దాని పరమాణుభారం అంచనాను మార్చుకొనవచ్చునన్న సూత్రంతో ఆవర్తన పట్టికను ప్రచురించారు.
మరికొన్ని విశేషాలు :
మెండలీఫ్ తన ఆవర్తన పట్టికను ప్రచురించి, ఆ పట్టిక పూర్తి చేయడానికి, అప్పటికి తెలియని అనేక మూలకాలను ఊహించాడు. కొద్ది నెలల తరువాత "మెయర్" సుమారు అలాంటి పట్టికనే ప్రచురించాడు. దీంతో మెయెర్, మెండలీఫ్ ఇద్దరూ ఆవర్తన పట్టిక ఆవిష్కర్తలని భావిస్తారు. కాని మెండలీఫ్ ఊహించినట్లుగా సరిగ్గా ఎకా సిలికాన్ (జెర్మానియం), ఎకా అల్యూమినియం (గాలియం), ఎకాబోరాన్ (స్కాండియం) మూలకాలు కనుగొనడం వలన ఆయనకు అత్యధికంగా గుర్తింపు వచ్చింది.
మెండలీఫ్ 1907లో రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మరణించారు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు. అలాగే.. విజ్ఞాన శాస్త్రానికి ఈయన చేసిన కృషికి గుర్తింపుగా మూలకాల పట్టికతో రూపొందిచిన ఒక శిల్పం - స్లొవేకియాలోని బ్రాటిస్లావియాలో వుంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more