పర్వతారోహణ చేయడమంటే అంతా సామాన్యమైన విషయం కాదు! ఆకాశమే హద్దుగా అన్నట్లు ఎంతో ఎత్తులో వుండే ఆ పర్వతాలను తలచుకుంటేనే ప్రతిఒక్కరి గుండెల్లో గుబులు పుట్టుకొస్తాయి. అలాంటి వాటిని ఎక్కాలంటే ఎంతో శిక్షణ పొందడంతోపాటు అర్హత సాధించాల్సి వుంటుంది. కానీ.. ఏ శిక్షణ లేకుండా పర్వతాలను అవరోహించి.. గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు ఓ తెలుగోడు. జీవితంలో తానేమీ సాధించలేనన్న భయమే అతనిని ఆకాశంవైపుకు నడిపించింది. అతనే మల్లి మస్తాన్ బాబు! ఆంధ్రప్రదేశ్ కు చెందిన మస్తాన్.. 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కాడు.
బాల్యం-విద్యాభ్యాసం :
1974 సెప్టెంబర్ 3వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం మండలంకు చెందిన గాంధీజనసంగం అనే ఓ చిన్న కుగ్రామంలో మల్లిమస్తాన్ బాబు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సుబ్బమ్మ, మస్తానయ్యలు మత్స్యకార కుటుంబానికి చెందినవారు. ఈ దంపతులకు 5వ సంతానంగా పుట్టిన మస్తాన్‌బాబుకు ఇద్దరు సోదరులు,ఇద్దరు అక్కలు వున్నాడు. మస్తాన్ తన స్వగ్రామంలోనే 3వ తరగతివరకు పాఠశాలలో చదువుకున్నాడు. 4, 5 తరగతులను సంగంలోని ఒక ప్రెవేటు పాఠశాలలో చదివాడు. ఆ తరువాత 1985లో కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు (1985-92) విజయనగరం జిల్లాలోని కొరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.
అనంతరం జంషెడ్పూర్ లోని నిట్‌లో(1992-96) ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఖరగ్‌పూర్‌లోని ఐఐటిలో ఎంటెక్ విద్యనభ్యసించాడు. తర్వాత 1998 నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్సులో సాప్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేశాడు. 2002-2004 వరకు కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేశాడు. అంతేకాదు.. ఇండియా, కెన్యా, దుబాయి, అమెరికా దేశాలలోని పలు మేనెజిమేంట్ కోర్సు కళాశాలలోను.. సాంస్కృతిక, స్వచ్చంధ సాంఘిక సంస్థలలోను, వృతిపరమైన సంస్థలలో, వ్యాపారసంస్థలలో, నాయకత్వం-నిర్వహణ వంటి విషయాలలో ప్రేరణ, మార్గదర్శక ఉపన్యాసాలు ఇచ్చాడు.
పర్వతారోహణ :
మస్తాన్ బాబు 6వ తరగతి చదువుకుంటున్న రోజుల్లోనే అతనికి కొండలను ఎక్కడంపై అభిరుచి పెరిగింది. అలాగే.. 1985లో కోరుకొండ స్కూలు ఆవరణలో ఉన్న ఎవరెస్టు శిఖరాన్నిఅధిరోహించే పయత్నంలో పూర్వ విద్యార్థి ఉదయకూమార్ ప్రాణాలు కోల్పోయాడు. అతని విగ్రహం ఇతను చదువుకుంటున్న స్కూల్లోనే వుంది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఇతనికి పర్వతాలను అవరోహించాలన్న కోరికకు ప్రేరణ కలిగింది. దాంతో అతడు సెలవుల్లో తన స్వగ్రామం వెళ్లినప్పుడు ఎన్నోసార్లు కాళ్ళు, చేతులు కట్టుకుని కనిగిరి రిజర్వాయరులో ఈదేవాడు. కొండలను ఎక్కేందుకు ప్రయత్నించేవాడు.
ఈ క్రమంలోనే ఇతడు 2006లో పర్వతాలను అవరోహించేందుకు తన ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటగా 2006 జనవరి 19వ తేదీన అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌మానిఫ్ (4897 మీ. ఎత్తు) పర్వతాన్ని ఎక్కాడు. ఆ పర్వతమెక్కిన మొదటి భారతీయుడిగా మల్లి మసాన్‌బాబు రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 2006 ఫిబ్రవరి 17వ తేదీన దక్షిణ అమెరికాలోని అకోన్‌కగువా (6962 మీ. ఎత్తు) శిఖరాన్ని అవరోహించాడు. అలాగే.. కిలీమంజరో(ఆఫ్రికా)(5895 మీ. ఎత్తు) శిఖరాన్ని 2006 మార్చి 15, కోస్‌కుయిజ్‌కో(ఆస్ట్రేలియా)(2228 మీ. ఎత్తు) 2006 ఏప్రిల్ 1, ఎవరెస్టు(ఆసియా)(8850 మీ. ఎత్తు) 2006 మే 21, ఎల్బ్రస్(ఐరోపా)(5642 మీ. ఎత్తు) 2006 జూన్ 13, డెనాలి(ఉత్తర అమెరికా)(6194మీ. ఎత్తు) 2006 జూలై 10న అవరోహించాడు.
అంటే.. 2006లో ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఏడు ఎతైన, దుర్లభమైన పర్వతశిఖరాలను 172 రోజుల అతితక్కువ కాలంలో అధిరోహించాడు. ఈ రికార్డు కేవలం మల్లిమస్టాన్ బాబుకే చెందుతుంది. అంతేకాదు.. వాటితోపాటు చిలీ, అర్జెంటీనా దేశ సరిహద్దుల్లో ఉన్న ఓజోస్‌డెల్‌సాలాడో అనే 6893మీటర్ల ఎత్తువున్న అగ్నిపర్వతాన్ని అతిసులువుగా అధిరోహించారు. రష్యాదేశంలోని ఎల్బ్రూన్ పర్వతాన్ని మూడు సార్లు ఎక్కాడు. అర్జెంటీనాలోని పర్వతశ్రేణుల్లో 6000 మీటర్లకన్న ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వత శిఖరాలను అధిరోహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
మల్లిమస్తాన్ బాబు మరణం :
మల్లి మస్తాన్ బాబు తన స్నేహితులతో కలసి అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వాతాలను ఎక్కడం కోసం భారత్ నుంచి 2014 డిసెంబర్ 16న వెళ్ళాడు. మార్చి 22వ తేదీన ఆండీస్ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్ (6749 మీటర్లు)ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్ క్యాంప్ నుంచి బయల్దేరాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్ క్యాంప్‌కు వస్తానని తన స్నేహితులతో మాట్లాడాడు కానీ.. అతను తిరిగి రాలేదు. మంచులో చిక్కుకుపోవడంతో మస్తాన్ మరణించాడని అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more