బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి అరాచకాల నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కల్పించడం కోసం ఎందరో వీరులు ఈ భరతమాత గడ్డపై అమరులైన విషయం విదితమే! అయితే.. హింసతో పరిపాలన కొనసాగిస్తున్న తెల్లదొరల నుంచి దేశాన్ని స్వాతంత్ర్యం కల్పించాలంటే అహింస బాటలో నడవడమే ఆయుధమంటూ మహాత్మాగాంధీ ముందుకొచ్చారు. ఆ బాటలోనే దేశాన్ని నడిపించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఈయన అవలంభించిన పద్ధతులు, పాటించిన సూత్రాలు ఎందరినో ఆకర్షించాయి. అలా ఆకర్షితులైనవారు దేశస్వాతంత్ర్యంలో పాలుపంచుకుని తమవంతు కృషి చేశారు. అలాంటివారిలో వావిలాల గోపాలకృష్ణయ్య కూడా ఒకరు! గాంధీ సూత్రాలను ఆకర్షితులైన ఈయన.. ఆయన నడిచిన అహింస బాటలోనే నడుస్తూ స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించారు.
జీవిత చరిత్రం :
1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా గోపాలకృష్ణయ్య జన్మించారు. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే ఈయన.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. దేశాన్ని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కల్పించడంలో తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. అంతేకాదు.. ఈయన తన జీవిత కాలంలో పలు రచనలు కూడా చేశాడు. తెలుగులో 45, ఆంగ్లంలో 16 పుస్తకాలు రచించాడు. తన రచనల ద్వారా స్వాతంత్ర్యోద్యమం ప్రాముఖ్యతను తెలిపి.. ఎందరినో చైతన్యపరిచిన ప్రముఖ రచయిత! ఇంకా ఈయన రాసిన ఇతర రచనలు కూడా బాగానే ప్రసిద్ధి చెందాయి.
స్వాతంత్ర్యోద్యమంలో గోపాలకృష్ణయ్య కృషి :
స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన భీమవరపు నరసింహారావుతో గోపాలకృష్ణయ్య కలిసి... ఇంటింటికీ తిరిగి ‘స్వరాజ్య భిక్ష’ పేరుతో బియ్యం, జొన్నలు సేకరించారు. ఆ సేకరించిన ఆహారపదార్థాలతో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించాడు. అలాగే.. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. కొన్ని ఉద్యమాల్లో భాగంగా నిర్వహించిన ప్రసంగంలో తన వాక్చాతుర్యంతో ఇతర ప్రజలను ఉత్తేజపరించాడు. అలాగే.. గాంధీజీ సూత్రాల గురించి, స్వాతంత్ర్య సమరం ప్రత్యేకత గురించి వివరిస్తూ.. ప్రతిఒక్కరికి వాటిమీద అవగాహన కల్పించడంలో నిత్యం శ్రమిస్తుండేవారు.
ఇక రాజకీయాల్లోనూ ఈయన అద్భుతంగా తనవంతు కృషి చేశారు. ‘ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది’ అని తెలిపారు. 1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. గుంటూరు అరండల్‌పేటలో ఈయన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్’ అనే సంస్థని ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన 2003 ఏప్రిల్ 29న పరమపదించారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా కూడా ఉన్నారు.
ఈయనకు లభించిన పదవులు-బిరుదులు :
1. ‘ఆంధ్రాగాంధీ’గా పిలువబడే ఈయన సోషలిస్టు
2. 1974 - 77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా పని చేశాడు.
3. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
4. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
5. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
6. 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.
7. పద్మభూషణ్ అవార్డు గ్రహీత.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more