కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. డబ్బుకు కొదవే లేదు.. మాటకు తిరుగే లేదు.. అయినా అహాన్ని దగ్గరకు రానీయని వ్యక్తిత్వం, అంతా అభిమానులిచ్చేందేనన్న ఆలోచన స్వభావం.. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా బాలీవుడ్ పిలిచినా, తలైవాగా చెన్నై ప్రజలు పిలిచినా.. అన్నీ సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించే..! రజినీ కాంత్ ఈరోజుతో 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం కబాలి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. ఎప్పుడూ తన పుట్టిన రోజును ఏ ఆర్భాటం లేకుండా చిన్నగా ముగించేస్తారు. ఇటీవల చెన్నైని భారీ వరదలు ముంచెత్తి, తీరని విషాదం మిగల్చటంతో ఈ సారి మాత్రం పూర్తిగా పుట్టినరోజు వేడులకు దూరంగా ఉన్నారు.
1960లో తమిళనాడు లో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్.. ఓ సాధారణ బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ప్రస్తుతం కోట్లాది మంది అభిమానుల సినీసామ్రాజ్యాన్ని ఏలుతున్నారనటంలో సందేహం లేదు. రజిని పేరు వినగానే తమిళనాడులో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరూ అభిమానంతో చూస్తారు. భారతదేశం లోని మిగిలిన రాష్ట్రాలలో కూడా రజినికాంత్ అంటే గౌరవం చూపుతారు. రోబో సినిమా తరువాత విదేశాలలో కూడా ఆయనకు గుర్తింపు దొరికింది. ఇకపోతే సినీ ప్రపంచంలోని వారు రజినీకాంత్ కు ప్రత్యేక గౌరవం ఇస్తారు. దీనికి ముఖ్య కారణం, ఆయన సూపర్ స్టార్ అయినా, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతారు.
రజినీకాంత్ తను నటించే సినిమాలకు తీసుకునే పారితొషకం చాలా ఎక్కువ. సినీ నటులలో అధిక మైన పారితొషకం తీసుకునే నటులలో ఈయన 2 వ స్తానం లో ఉన్నారు. అయితే ఈయన తన పారితోషకాన్ని సినిమా తీసే నిర్మాత్మను బట్టి మార్చుకుంటారు. పెద్ద నిర్మాత దగ్గర ఎక్కువగానూ, చిన్న నిర్మాత దగ్గర తక్కువగానూ తీసుకుంటారట. ఈయన దగ్గర అందరికీ నచ్హిన విషయమేమిటంటే తను నటించిన సినిమా ఫ్లాప్ అయితే తాను ఆ సినిమాకు తీసుకున్న పారితోషకాన్ని ఆ నిర్మాతకో, వినియోగదారులకో తిరిగి ఇచ్హేయడమే. ఈయన నటించిన ఆంగ్ల సినిమా "బ్లడ్ స్టోన్" కు ఈయన డాలర్లలో పారితోషకం తీసుకున్నారు. రూపాయలలో అది 25 కోట్లట.
చాలామంది స్టార్లు డబ్బు సంపాదించాక అనేక వ్యాపారాలు పెట్టి పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. కానీ రజినీకాంత్ కు ఒక్క వ్యాపారం కూడా లేదు. రేపటి గురించి నేను ఆలోచన చేయను అందుకే తాను అంత ప్రశాంతంగా ఉంటాను అంటాడు రజినీకాంత్. తన పై తానే సెటైర్లు వేసుకునే రజినీకాంత్ కు నిజజీవితంలో నటించడం అంటే ఇష్టం ఉండదు. ఇన్ని మంచి భావాలూ ఉన్నాయి కాబట్టే రజినీకాంత్ క్రేజ్ ఎవ్వరు అందుకోలేని స్థాయిలో ఎదిగిపోయి భారతదేశ హద్దులు దాటి జపాన్, చైనా దేశాలలో కూడా రజినీకాంత్ కు అభిమానులను సంపాదించి పెట్టింది. ప్రతి మనిషి తమ జీవితంలో నేర్చుకోవలసిన ఎన్నో మంచి విషయాలు రజినీకాంత్ జీవతంలో ఉన్నాయి. అలాంటి స్టార్ హీరో రజినీ కాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది తెలుగువిశేష్. మరిన్ని సినిమాల్లో నటించి, ఎంతో మందికి సేవ చెయ్యాలని, ఆ దేవుడి అనుగ్రహం ఎళ్లవేళలా రజినీకాంత్ కు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more