సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం రకరకాల లోషన్లు, ఇతర బ్యూటీషియన్ కు సంబంధించిన మేకప్ కిట్ లను నిరంతరం వాడుతూనే వుంటారు. ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే... తమతోపాటే నిరంతరం బ్యూటీ కిట్ ను తీసుకుని వెళుతుంటారు. ఇవి వేసుకున్న కొద్దిసేపటివరకు చూడటానికి అమ్మాయిలు అందంగానే కనిపిస్తారు కానీ... ఆ తరువాత ముఖం మీద అక్కడక్కడ తెల్లని మచ్చలు ఏర్పడిపోతాయి. అలాగే కంటికింద నల్లనిఛాయలు, చర్మం పొడిబారిపోవడం ఇంకా ఇతరత్ర చర్మసమస్యలు వస్తాయి. అటువంటి వాటిని కవర్ చేయడం కోసమే తమ బ్యూటీ కిట్ లను అమ్మాయిలు నిరంతరం ఉపయోగిస్తూవుంటారు. కొన్నాళ్లవరకు బాగానే వుంటాయి కానీ.. తర్వాత రానురాను కాలక్రమంలో చర్మ సమస్య వ్యాధులు వచ్చే హెచ్చరికలు వుంటాయి.
అలాకాకుండా అందంగా కనిపించడానికి కొన్ని సహజమైన పద్ధతిలో చిట్కాలు అందుబాటులో వున్నాయి. ప్రకృతిలో లభించే పండ్లతోపాటు ఇతర పదార్థాలను అందం కోసం ఉపయోగిస్తే.. కాంతివంతమైన అందాన్ని పొందడంతోపాటు ఆరోగ్యపరంగా చర్మానికి అందాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, ఇంకా ఇతర పోషక పదార్థాలు అందుతాయి. ఫలితంగా చర్మం పొడిబారకుండా మృదువుగా, చాలా సాఫ్ట్ గా వుంటుంది. అలాగే భవిష్యత్తులో చర్మం మీద ఎటువంటి మచ్చలు ఏర్పడనీయవు. చర్మం ముడతలు పడకుండా చాలాకాలం వరకు యంగ్ లా కనిపిస్తారు. మరి ఆ సహజ చిట్కాలెంటో ఒకసారి తెలుసుకుందాం...
సౌందర్యానికి సహజ చిట్కాలు :
1. బాగా పండిన జామ పండును తీసుకుని రెండు భాగాలుగా చేయాలి. మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలను ఒక బౌల్ లో తీసుకుని.. అందులో రెండు లేదా మూడు జామ ఆకులను కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. అనంతరం ఒక స్పూను పేస్ట్‌ను మరొక చిన్న బౌల్‌లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్‌లో రెండు స్పూన్లు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. (జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి). ముందుగా ముఖాన్ని నీటితో కడిగి క్లెన్సింగ్ చేయాలి. పేస్ట్‌ను ముఖంపై వలయాకారంలో రబ్ చేయాలి. పదినిమిషాలపాటు మసాజ్ చేసి తడి కాటన్‌బాల్స్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఫేషియల్ ప్యాక్‌ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి చేస్తే కాంతివంతమైన అందాన్ని పొందడమేకాకుండా చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
2. రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ పుదీనా రసాన్ని ముఖానికి పట్టించి తెల్లవారి కడిగేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
3. ఒక టొమాటోని తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని తరిగిన టొమాటో ముక్కలతో ముఖాన్నంతా వలయాకారంలో సుతిమెత్తగా అయిదు నిమిషాల పాటు మర్ధనా చేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది.
4. పెదవులకోసం : కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more