మహిళలు అందంగా కనిపించడంలో కళ్లు కూడా కీలకపాత్రను పోషిస్తాయి. చాలావరకు వీళ్లు తమ కళ్ల ద్వారానే తమ హావభావాలను ఇతరులకు వ్యక్తపరుస్తారు కాబట్టి.. వాటికి మరిన్ని కొత్త కళలు అద్దితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ముఖం అందం కూడా ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. కళ్లకు సంబంధించి రకరకాల ఫ్యాషన్, బ్యూటీ టిప్స్ చాలానే వున్నాయి. అయితే వాటిని పరిస్థితులకు అనుగుణంగా అమలుచేసుకుంటే.. అవి ఎంతో అందంగా కనిపించడంతోపాటు ఎటువంటి హానిని కలిగదు. మరి ఆ చిట్కాలు ఏంతో మన తెలుసుకుందాం..
1. ఐ-లైనర్ : ఇది కళ్లను ఆకర్షణీయంగా కనిపించడానికి ఎంతో సహాయపడుతుంది. లైనర్ కేక్, స్టిక్, లిక్విడ్ లైనర్ రూపంలో మార్కెట్లలో ఇది లభ్యమవుతుంది. బ్లూ, బ్రౌన్ రంగులలో వుండే లైనర్ లను వాడితే కళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
2. ఐ-షాడో : ఇది కళ్ల మేకప్ లో ఎంతో ప్రధానమైంది. ఇది రకరకాల రంగులలో లభ్యమవుతుంది. సయమానుకూలంగా అంటే... ఒక్కొక్క రంగులను ఒక్కొక్క సమయంలో వేసుకోవడం వల్ల కళ్లు ఎంతో ఆకర్షణీయంగా కనబడుతాయి. ఇది బ్లూ, బ్రౌన్, గ్రీన్, గోధుమరంగు, రాగి రంగు, బూడిద రంగు, సీ గ్రీన్స్, గులాబీ, నీలం, ఎరుపు.. ఇంకా రకరకాల రంగులలో లభ్యమవుతుంది.
3. మస్కారా : సాధారణంగా రెప్పలకు వేసుకునే మస్కారా ట్రాన్స్ ఫరెంట్ గా నలుపు రంగులో వుంటే చాలా మంచిది. ప్రస్తుతకాలంలో ఇది సిల్వర్, గోల్డ్, చమ్కీలున్న మస్కారాలు రకరకాలుగా లభ్యమవుతున్నాయి. ఇది కళ్లను ఎంతో ఆకర్షణీయంగా మలుచుతుంది.
వేసుకునే విధానం : ఐ-లైనర్, ఐ-షాడోలను ఒకేవిధంగా కళ్ల లోపలి మూలాల నుంచి బయట దిశగా పూసుకోవాలి. అవసరమైతే ఈ రెండింటిని ఒకేసారి వేసుకోవచ్చు కూడా. మస్కారా అయితే కంటి రెప్పలపై లోపలి దిశ నుంచి వెలుపలి వరకు వేసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more