Beauty tips to stay away from oil skin

beauty tips, oil skin tips, healthy beauty tips, beauty tips for face, facial packs, oil skin facials, oil skin facial packs, facial packs, beauty tips for face, face beauty tips

beauty tips to stay away from oil skin

ఆయిల్ స్కిన్ నుంచి బయటపడే మార్గాలు!

Posted: 10/08/2014 04:19 PM IST
Beauty tips to stay away from oil skin

మానవ శరీరంలో వుండే హార్మోన్ల మార్పిడి వల్ల చర్మసౌందర్యానికి సమస్యలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా మార్పిడి సంభవించిన తరువాత చర్మంపై ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. దీంతో ముఖం మొత్తం ఆయిల్ స్కిన్ గా మారిపోతుంది. శరీరంలో వేడి అధికశాతం వుండటం, స్మోకింగ్, ప్రెగ్నెన్సీ సమయాల్లో కూడా చర్మసౌందర్యానికి సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి.ఇలా సాధారణమైన విషయమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది. ముఖం అందం పూర్తిగా మారిపోవడమే కాకుండా మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాకాకుండా ఆయిల్ స్కిన్ సమస్య నుంచి బయటపడాలంటే.. కొన్ని సహజ చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటంటే..

1. నిమ్మరసం... ఇందులో సిట్రిక్ యాసిడ్ తోపాటు యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగివుంటాయి. ఈ నిమ్మరసంలో ఒక స్పూన్ అరటీ, డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

2. ఎగ్ వైట్... ఇందులో విటమిన్లు ఎక్కువ మోతాదులో వుంటాయి. ఇది చర్మకాంతిని పెంచడమేకాక, భర్మాన్ని బిగుతుగా చేసి, జిడ్డును తొలగిస్తుంది. ఈ ఎగ్ వైట్ ను, నిమ్మరసంలో కలిపి, ముఖానికి పట్టించుకోవాలి. ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇలా వారానికి కనీసం మూడు సార్లు అయినా చేసుకోవాలి.

3. పెరుగు... ఇందులో వుండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై వున్న జిడ్డును తొలగించి, ఎఫెక్టివ్ గా చేస్తుంది. ఒక చెంచా సాదా పెరుగు తీసుకుని ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచింది.

4. టమోటో... ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా.. రక్తస్రావ పద్ధతి (ఆస్ట్రిజెంట్)ని ఆపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో వుండే విటమిన్ సి మొటిమలు తొలగించడానికి సహాయపడుతుంది. టమోటోను రెండుగా కట్ చేసి ముఖంపై కాసేపు వుంచి, నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. యాపిల్... ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైంది. ఎందుకంటే.. ఇందులో చాలావరకు పోషకాలు లభిస్తాయి. ఇది యాంటిసెప్టిక్, ఆస్ట్రిజెంట్, స్మూతింగ్ వంటి లక్షణాలను కలిగి వుంటుంది. ఇందులో వున్న మాలిక్ యాసిడ్స్ చర్మంమీద వున్న డెడ్ సెల్స్ ను, ఆయిల్ ను తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. యాపిల్ ముక్కలను బాగా తురిమి, పేస్ట్ ను చర్మంపై అప్లై చేసుకోవాలి. కాసేపు తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.

6. కీరదోస.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఇలతో పాటు పుష్కలమైన మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు వుంటాయి. ఇది చర్మంపై వుండే ఆయిల్ ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తాజాగా వుండే ఒక కీరదోసకాయను కట్ చేసే ముఖం మీద రుద్దుకోవాలి. దానిని రాత్రంతా అలాగే వుంచి, ఉదయాన్నే గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి.

7. పాలు... ఇందులో వుండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ చర్మానికి ఎంతో ఉపయోగకరమైంది. ఇది స్కిన్ ను సాఫ్టగ్ గా వుంచుతుంది. పాలలో రెండు లేదా మూడు చుక్కలు లావెండ్ ఆయిల్ మిక్స చేసి, నిద్రపోయే ముందు పట్టించాలి. ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. కలబంద (అలోవెరా)... ఇందులో వుండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఆయిల్ స్కిన్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. తాజాగా వుండే కలబందను ముఖానికి బాగా పట్టించుకోవాలి. ఎండిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

9. తేనె... తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. ఇది చర్మంలో వుండే రంధ్రాలను బ్లాక్ చేసి, సాఫ్ట్ గా చేస్తుంది. తేనెను ముఖానికి స్వల్ప మొత్తంలో పట్టించుకుని కాసేపు వరకు అలాగే వుంచుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  health tips  oil face packs  face problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more