అమ్మాయిల సహజ సౌందర్యాన్ని పెంపొందించడంలో రోజాపువ్వు (గులాబీ) రేకులు అద్భుతంగా తోడ్పడుతాయి. అంతెందుకు.. పురాతన కాలం నుంచి గ్రీకులు, రోమన్స్ తమ సౌందర్యసాధనాల్లో వీటిని విరివిగా ఉపయోగించేవారు. శతాబ్దకాలాల నుంచి వీటిని కాస్మొటిక్స్, మెడిసిన్స్, థెరపీ ట్రీట్ మెంట్లలో వినియోగిస్తూనే వున్నారు. ఇప్పటికీ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ని వీటి ద్వారా తయారుచేస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ గులాబీ రేకుల్లో ఎన్ని బ్యూటీ బెనిఫిట్స్ వున్నాయి. వీటిలో మొటిమల నివారణ, గొంతునొప్పిని తగ్గించడం, చర్మసౌందర్యాన్ని పెంచడం వంటి లక్షణాలు పుష్కలంగా వుంటాయి. వీటి ద్వారా కలిగే మరిన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా..
1. గులాబీ రేకుల్లో మెటిమలు, మచ్చలను నివారించే యాంటీ బ్యాక్టీరియల్ ఎసెన్షియల్ ఆయిల్ వుంటుంది. ఈ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుంటే.. నిగారింపైన చర్మాన్ని పొందవచ్చు.
2. యాంటీ ఇన్ఫ్లమేటరీ : రోజాపువ్వులోని సున్నిత లక్షణాలు చర్మ సమస్యలను దురద, తామర వంటివి నివారిస్తుంది. రోజాపువ్వు రేకులను నీటిలో రెండు మూడు గంటలు నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3. యాంటీఆక్సిడెంట్స్ : రోజాపువ్వుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.
4. మాయిశ్చరైజింగ్ : గులాబీలో ఉండే నేచురల్ ఆయిల్స్ చర్మం మాయిశ్చరైజర్ కు సహాయపడుతుంది. చర్మం స్మూత్ గా మార్చడానికి సహాయపడుతుంది.
5. నేచురల్ ఫ్రాగ్రెంట్ : చాలా వరకూ సువాసన భరిత ప్రొడక్ట్స్ లో రోజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే.. ఇది ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ను అందిస్తుంది.
6. రిలాక్సింగ్ : ఆరోమాటిక్ రోజ్ ను ఉపయోగించడం వల్ల ఇది మనస్సుకు ప్రశాంతతకు కలిగిస్తుంది. అందుకే వీటిని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
7. టానింగ్ : గులాబీలో ఉండే టానింగ్ ప్రొపర్టీస్, నేచురల్ ఆస్ట్రిజెంట్స్ చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. అలాగే చర్మానికి గ్లోయింగ్ కాంప్లెక్షన్ అందిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more