వేసవికాలం వచ్చిందంటే చాలు.. చర్మసౌందర్యానికి సంబంధించి ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కాలంలో సూర్యతాపం ఎక్కువగా వుండటం వల్ల ఏ పని చేయకపోయినప్పటికీ శరీరం నుంచి చెమట విసర్జిస్తూనే వుంటుంది. పైగా వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మరంధ్రాల్లో చేరిపోవడంతో... చర్మం పొడిబారినట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ దెబ్బతో మొటిమలు, నల్లని ఛాయలు, ఇంకా ఇతరత్ర చర్మసమస్యలు వస్తూనే వుంటాయి. బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ అంతగా ఫలితం వుండదు.
అయితే.. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్మసమస్యల్ని అధిగమించేందుకు కొన్ని చిట్కాలు వున్నాయి. కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ ని మాత్రమే నమ్ముకోకుండా చర్మానికి పోషకాలు అందించే పదార్థాలతో రెమెడీస్ చేసుకుని, చర్మానికి పట్టిస్తే ఫలితం గమనించవచ్చు. ఇలాంటి రెమెడీలు చాలా వున్నాయి. అందులో ఆరెంజ్-పెరుగు ఫేస్ ప్యాక్ ఒకటి! ఈ ప్యాక్ ను ఈ వేసవిలో ట్రై చేస్తే.. మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. అలాగే దీనిని ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ పట్టిస్తే.. మొటిమలు, బ్లాక్ స్పాట్స్ తొలగిపోవడంతోపాటు మృదువైన చర్మం పొందవచ్చు. మరి ఈ ప్యాక్ ని ఎలా చేస్తారో తెలుసుకుందామా...
ఆరెంజ్-పెరుగు ఫేస్ ప్యాక్ తయారీవిధానం :
- ముందుగా నారింజ నుంచి తొక్కలని విడదీసి.. వాటిని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఎండిన నారింజ తొక్కలను దంచి, పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా తయారుచేసిన ఈ పౌడర్ లో కాస్త (అర టీ స్పూన్) ఒక పాత్రలో తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిపోయేంతవరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. మెరుగైన సౌందర్యం పొందవచ్చు.
- మొటిమలు ఎక్కువగా వున్నవారైతే.. ఈ ఆరెంజ్-పెరుగు ఫేస్ ప్యాక్ లో కొన్ని చుక్కలు నిమ్మరసం కలుపుకోవాలి. బాగా కలియబెట్టిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని ఫేస్ కి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 15 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. బాగా ఆరిన అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఈ ఫేస్ ప్యాక్ పట్టిస్తే.. మొటిమలు దూరమవడంతోపాటు మెరిసే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more