మారుతున్న జీవన విధానం, వాతావరణ పరిస్థితుల కారణంగా సౌందర్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం ముడతలు పడటం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మచ్చలు ఏర్పడటం, పొడిపారిపోవడంతో చిన్నవయస్సులోనే ముసలివారులాగా కనిపిస్తారు. ఇటువంటి చర్మసమస్యల బారిన పడకుండా నిత్యం యవ్వనంగా వుండాలంటే ముందుగా చర్మంపై వచ్చే ముడతల్ని నివారించాలి. ముడతల్ని నివారించేందుకు కొన్ని ఫేస్ మాస్కులు అందుబాటులో వున్నాయి. వాటిని రెగ్యులర్ గా వేసుకుంటే.. ఆ ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మసౌందర్యం మరింత మెరుగవుతుంది. మరి.. ఆ ఫేస్ మాస్కులేంటో తెలుసుకుందామా..
* విటమిన్ సి మాస్క్ : ఒక పాత్రలో కొద్దిగా ఆరెంజ్ ఆయిల్, బాదం ఆయిల్, కొద్దిగా పేరు వేసి.. పేస్టులా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తే.. మంచి ఫలితం వుంటుంది.
* తేనె మాస్క్ : కొద్దిగా తేనె తీసుకుని దానిని ముఖానికి, శరీరానికి పట్టించాలి. కాసేపు బాగా మర్దన చేసుకోవాలి. అర్ధగంట తర్వాత గోరువెచ్చని నీరుతో స్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా ప్రతి రోజూ చేస్తే.. చర్మసంబంధిత వ్యాధులు దూరమవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
* అవొకాడో మాస్క్ : ఒక పాత్రలో కొద్దిగా అవొకాడో గుజ్జు తీసుకోవాలి. అందులో మెత్తగా పేస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ పేస్టు వేసి.. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, శరీరానికి పట్టించుకుని.. మర్దన చేసుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* బొప్పాయి-బనానా మాస్క్ : ఒక గిన్నె తీసుకుని అందులో బొప్పాయి గుజ్జు, అరటిపండు గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
* గుడ్డు : తేనె మాస్క్, ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన అరగంట తర్వాత ముఖం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది.
* ఆలివ్ ఆయిల్-పైనాపిల్ : ఈ రెండింటిని ఓ పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి.. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మానికి కావలసిన పోషణ లభించి, ఆరోగ్యంగా వుంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more