సమయానికి పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు కొన్ని సహజ చిట్కాలను రెగ్యులర్ గా పాటిస్తే.. స్త్రీలు తమ సౌందర్యాన్ని మరింతగా మెరుగుపర్చుకోవచ్చు. మార్కెట్ లో లభ్యమయ్యే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ‘ఇంటి చిట్కాలు’ సమర్థవంతంగా పనిచేసి.. చర్మ సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోనివ్వకుండా గులాబీలా మెరిసే అందాన్ని అందిస్తాయి. మెరుపులాంటి అందాన్ని అందించే చిట్కాలు ఎన్నో వున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మీకోసం...
* దానిమ్మ-తేనె : ముందుగా దానిమ్మ గింజలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేసుకుంటే ఫెయిర్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.
* పెసలు-పసుపు : ఒక పాత్ర తీసుకుని అందులో రెండు చెంచాల పెసళ్ళ పౌడర్, చిటికెడు పసుపు తీసుకోవాలి. ఆ రెండింటిలో కొద్దిగా పాలు జోడించి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
* బంతిపువ్వులు-రోజ్ : బంతపువ్వుల రేకులను మెత్తని పేస్టులా చేసుకుని.. దానిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మిగతావాటితో ఈ రెమెడీ ఎంతో ఉత్తమమైంది.
* తేనె-రోజ్ వాటర్ : ఒక పాత్రలో ఒక చెంచా తేనె తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* తులసి-వేప : ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు, మరికొన్ని వేప ఆకులు తీసుకొని, వాటిని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more